Home / MOVIES / ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే ..?

ఎప్పుడు.. ఎక్క‌డ‌.. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే ..?

మారువేషంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను.. క‌ల‌వ‌నున్న‌ కత్తి మహేశ్.. ఈ టైటిల్ చూసి ఖంగారు ప‌డ‌కండి.. అంత‌క‌న్నా ఆశ్చ‌ర్య పోవ‌ద్దు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. కొద్ది రోజుల‌గా ప‌వ‌న్ – క‌త్తి మ‌ధ్య చెల‌రేగిన వివాదం ప‌తాక స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో పీకే ఫ్యాన్స్ క‌త్తిని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు బూతుల వ‌ర‌కే అనుకుంటే.. తాజాగా క‌త్తి మ‌హేని కొట్టేందుకు ప‌వ‌న్ అభిమానులు తిరుగుతున్నారు.అందులో భాగంగానే.. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఓ చాన‌ల్ స్టూడియోకు వెళుతున్న కత్తి మహేశ్ కారును పవన్ ఫ్యాన్స్ అడ్డుకొని ధ్వంసం చేశారు. అనంతరం ఆ చానల్‌లో చర్చిస్తుండగా.. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు కార్యాలయం ముందు చేరి నానా హంగామా చేశారు. చివరకు పోలీసులు వచ్చి అభిమానులను చెదరగొట్టి కత్తి మహేష్‌ను సేఫ్‌గా తీసుకెళ్లారు.

దీంతో కత్తి మహేశ్ ఇప్పుడు ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో కనపడ్డా సరే అభిమానులు ఆయన పై దాడి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ క్రిటిక్‌కు హైదరాబాద్‌లో బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నానా ఇబ్బంది అవుతోంది..కత్తి మహేశ్ స్వతహాగా ఓ రివ్యూ రైటర్.. బిగ్ బాస్ లోకి వెళ్లి కాస్త ఫేమస్ అయ్యారు. ఇప్పుడు పవన్ ను తిడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన తన రివ్యూలను చెప్పడం ఇకముందు కష్టం కాబోతోంది.. ఎందుకంటే..కత్తి మహేశ్ ప్రతి శుక్రవారం విడుదలయ్యే కొత్త సినిమాలను హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లోకి వెళ్లి చూస్తుంటాడు. ఆ తర్వాత బయటకొచ్చి సినిమా గురించి వివరించి తాను పనిచేస్తున్న చానల్స్‌కు రివ్యూ ఇస్తాడు. ఇప్పుడా జాబ్‌కే ఎసరు వచ్చేలా ఉంది.పవన్ పై ఇటీవల తీవ్ర విమర్శలు చేయడం.. పూనమ్ కౌర్ తో సంబంధం అంటగట్టడంతో కత్తి మహేశ్ కనపడితే చాలే వేసేద్దామనట్టు పవన్ ఫ్యాన్స్ కాచుకు కూర్చొని ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే 10న విడుదలయ్యే అజ్ఞాతవాసి మూవీ రివ్యూను కూడా కత్తి మహేశ్ చెప్పాల్సి ఉంటుంది. మరి ఆ షో కోసం కత్తి మహేశ్ ఖచ్చితంగా ఏదో థియేటర్ వెళ్లి చూడాలి. చూస్తే అక్కడుండే పవన్ అభిమానులు ఊరుకోరు.. ఏం చేస్తారనేది ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ఎక్కడ సినిమా చూస్తాడు.. ఎలా రివ్యూ చెబుతాడు.. పవన్ ఫ్యాన్స్‌కు దొరికితే ఏమవుతుందనే ఉత్కంఠ నెలకొంది. అందుకోసమే.. కత్తి మహేశ్ ఓ ప్లాన్ వేశార‌ని.. మారు వేశంలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని విశ్వసనీయ సమాచారం. మొత్తంగా పవన్‌తో పెట్టుకొని తన రివ్యూ రైటర్ జాబ్‌కు కూడా క‌త్తి మ‌హేష్‌ ఎసరు పెట్టుకున్నాడు సినీ వ‌ర్గీయులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat