తమిళ హీరో సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఊహించి ఉండడు. సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్యతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు సూర్యను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయడం సూర్య బౌన్సర్లు, పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో వేరే దారిలేక గేటు దూకి తప్పించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్య తాజాగా నంటించిన గ్యాంగ్ చిత్రం ప్రమోషన్ కోసం సూర్య, దర్శకుడు విఘ్నేష్ శివన్, ఇతర చిత్రం యూనిట్‌తో కలిసి ఆయన రాజమహేంద్రవరం వచ్చారు.
ఇక అక్కడి స్థానిక మేనకా థియేటర్లో చిత్రం యూనిట్ విజయోత్సవ వేడుకలను నిర్వహించగా.. సూర్యను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్ద గుమిగూడారు. వారందరినీ సూర్య పలకరించిన అనంతరం.. థియేటర్ గేట్ నుంచి బయటికి రావాల్సి ఉండగా.. థియేటర్ బయట వందల సంఖ్యలో అభిమానులు ఉండటంతో లాభం లేదనుకుని వెనుకవైపు వెళ్లాడు. అక్కడున్న గేటుకు తాళం వేసి ఉండడంతో… థియేటర్ యాజమాన్యం తాళం చెవి తీసుకుని వచ్చేలోగా.. సూర్య గేటు దూకి బయటికి వచ్చారు. ఇక ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్ కోసం వెళ్లిన సూర్య అభిమానుల కాళ్లు పట్టుకోవడం వైరల్‌గా మారింది. ఇప్పుడు గేటు దూకిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.