Home / SLIDER / హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దుపై అస‌దుద్దీన్ షాకింగ్ కామెంట్…

హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దుపై అస‌దుద్దీన్ షాకింగ్ కామెంట్…

దేశంలో ప్రతి ఏడాది ముస్లింలు జరిపే హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త‌ద్వారా ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులు ప్రభుత్వ సబ్సిడీ లేకుండా సొంత చార్జీలపైనే వెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ యాత్రికులకిచ్చే సబ్సిడీని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు ఆదా అవుతుందని, ఆ డబ్బును మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల విద్యకు ఉపయోగిస్తామని చెప్పారు.అయితే ఇలాంటి ప‌రిణామంపై స‌హ‌జంగానే అంద‌రి చూపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప‌డుతుంది. అయితే ఊహించ‌న‌ట్లే ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. “హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది సరే.. మరి మిగతా ధార్మిక కార్యక్రమాలకు, యాత్రలకు ఇస్తున్న రాయితీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా?“ అని అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

వాస్తవానికి హజ్‌యాత్రకు కష్టపడ్డ సొమ్ముతో వెళ్లాలని, సబ్సిడీ వద్దని గతంలోనే తాము ప్రభుత్వానికి సూచించామని గుర్తుచేశారు. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, హ‌జ్ స‌బ్సిడీపై సుప్రీం కోర్టు 2012 లోనే తీర్పునిచ్చింది. మేం కూడా అదే చెప్పాం అన్నారు. కానీ ఇతర హిందూ ధార్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్న ఖర్చులు, ఇస్తున్న రాయితీల మాటేమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2014లో ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకు రూ.1150 కోట్లు ఖర్చు చేశారు. 2016లో మధ్యప్రదేశ్‌లో సింహస్థ కుంభమేళాకు కేంద్ర సాంస్కృతిక శాఖ రూ.100 కోట్లు విడుదలచేసింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.350 కోట్లను ఖర్చుచేసింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశ్నిస్తున్నాను.. యూపీలో యోగి సర్కార్ కాశీ, అయోధ్య, మధుర పర్యాటకుల కోసం, అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం రూ.800 కోట్లు వెచ్చిస్తున్నది. ఇప్పుడు మానస సరోవర్ యాత్రికులకు లక్షన్నర సబ్సిడీ ఇస్తానంటున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రికులకు సాయం చేస్తానని ప్రకటించింది.

రాజస్థాన్ ప్రభుత్వం దేవాలయాల రూ.260 కోట్లు ఇచ్చింది. గుజరాత్‌లో కేంద్రం 2017-18లో దేవస్థానాలకు రూ.38 కోట్లు ఇచ్చింది. ఇతర రాష్ర్టాల్లోనూ ఆలయాలకు రూ.కోట్లు విడుదల చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ తెచ్చి ఈ నిధులను ఆపగలుగుతారా?` అని ఓవైసీ నిలదీశారు. `వాస్తవానికి హజ్ యాత్రికులకు ఇస్తున్న రాయితీ మొత్తం రూ.200 కోట్లు మాత్రమే. ఇంతదానికే ఎంతో చేశామని సర్కార్ గొప్పలు చెప్పుకొంటోంది. ఈ సర్కార్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మైనారిటీల బాలికలకు డిమాండ్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌ను పెంచిచూపాలి` అని ఒవైసీ సవాల్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat