Home / ANDHRAPRADESH / మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన క్షోభను అనుభవించాం అని ఒక లేఖ రాస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు .అది యదాతధంగా మీకోసం ..అప్పటి ఉమ్మడి ఏపీలో తెలంగాణలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. కానీ నాలుగు యేండ్ల కిందట రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఒక పద్ధతి ప్రకారం, సరైన వ్యూహంతో ఆ సమస్య నుంచి బయటపడేలా చేయడమే కాకుండా కేవలం ఆరునెలల సమయంలోనే పరిశ్రమలకు 24 గంటల కరంట్ సరఫరా చేసింది .అంతే కాకుండా ఏకంగా 9 గంటల కరంట్ వ్యవసాయానికి, 24 గంటల కరంట్ గృహాలకు సరఫరా కూడా చేశారు .

ఈ ఏడాది నుండి వ్యవసాయానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంటును ఇస్తుంది .2014లో తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 6000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండేది. అందులో కేవలం 2800 మెగావాట్లు హైడల్ పవర్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రస్తుతం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 14000 మెగావాట్లకు చేరింది. 2020నాటికి 28000 మెగావాట్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటివల ప్రకటించారు .రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసింది సర్కారు . ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.1000కు .. దివ్యాంగులకు రూ.1500 ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ . గత ప్రభుత్వాలు పీడీఎస్ కింద పరిమితి విధించి 4 కిలోల బియ్యం ఇస్తే.. ప్రస్తుతం పరిమితి ఎత్తివేసి కుటుంబసభ్యులు ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణలోని గోదాముల సామర్థ్యం 4 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉంటే.. మా ప్రభుత్వంలో 23 లక్షల టన్నులకు పెంచాం. ఎరువుల, విత్తనాల సమస్యలు ఇస్తూనే మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెట్టుబడి అందించబోతుంది .

అందులో భాగంగా ఏడాదికి రెండు పంటలకుగాను ఎకరానికి రూ.8000 ముందస్తుగా ఇవ్వబోతున్నారు . అంతేకాదు మద్దతు ధర, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులను ప్రారంభించారు .దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయనివి ఇక్కడ చేస్తున్నారు . ఏడాదికి రూ.40 వేల కోట్లు సబ్సిడీల రూపంలో చెల్లిస్తూ పేద వర్గాలను, సంక్షేమానికి దూరంగా ఉన్నవాళ్లను పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూనే మరోవైపు గోదావరి, కృష్ణా నుంచి కేటాయించిన 1350 టీఎంసీ నీళ్లని కాపాడుకునేందుకు, సాగునీటిరంగాన్ని పటిష్ఠపరిచేందుకు నిరంతరం కృషి చేస్తుంది టీఆర్ఎస్ సర్కారు . సాగునీటిరంగంలో ముఖ్యమంత్రి అద్భుతాలు సృష్టిస్తున్నారు . మొన్ననే కేంద్ర జల సంఘం కూడా తెలంగాణకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపనులు పరిశీలించి ప్రశంసలతో ముంచెత్తింది.

ఇలాంటి గొప్ప ప్రాజెక్టును ఎక్కడా చూడలేదు అని పొగిడింది. దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఇవన్నీ సకాలంలో పూర్తవుతున్నాయి.రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో తలపెట్టిన 3 మేజర్ ప్రాజెక్టులు తెలంగాణ వ్యవసాయరంగం తలరాతను మార్చబోతున్నాయి. గోదావరి, కృష్టాజలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోత పథకాలను నిర్మిస్తున్నారు . ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలు సాగులోకి వస్తాయి.ఆర్థికవృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్. ఇది మేం చెబుతున్న మాట కాదు… కేంద్ర ఫైనాన్స్ కమిషన్, కాగ్ చెప్పిన మాటలివి. దేశంలో 16 రంగాల్లో తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ గా ఉందని కేంద్రమే అంగీకరిస్తోంది. కేసీఆర్ చెప్పింది అక్షర సత్యం. ఆంధ్రాతో తెలంగాణను కలపడం ఫెయిల్యూర్ స్టోరీ.. విభజన అనేది సక్సెస్ స్టోరీ అని అలాంటప్పుడు అభివృద్ధిలో సంక్షేమంలో ఏపీతో పోల్చవద్దు అని కేసీఆర్ అన్న వ్యాఖ్యల్లో తప్పు ఏముంది అని సదరు నెటిజన్ బాబుకు ప్రశ్నలు సంధించారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat