Home / LIFE STYLE / వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా..?

వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా..?

ఇప్పుడు అన్నింటికీ మిషన్లు వచ్చినట్టే..వాషింగ్ కు వచ్చేశాయి.ఒక్కప్పుడైతే మొదట నానబెట్టి ,సబ్బు పెట్టి మంచిగా రుద్దుకొని బట్టలు వుతుక్కునే వారు.ఇప్పుడు యాంత్రికంగా మిషన్లో వేసేసి తీసి అరెసుకుంటున్నారు .ఈ క్రమంలో చాలా మంది వాషింగ్ మిషన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు.కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు.దీని ద్వారా దుస్తువులు త్వరగా పాడై పోవడము ,పోగులు బయటికి వచ్చి రంగు పోవడం జరుగుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుస్తువులను ఎంతోకాలం మన్నికగా,జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధాణంగా మనం కుట్టించుకున్న దుస్తువులకైన ,రెడీమేడ్ గా కొన్న దుస్తువులకైన వాటి మీద లేబుల్స్ కచ్చితంగా ఉంటాయి.లేబుల్స్ పై ఆ దుస్తువులపై ఎలా ఉతకాలో రాసి వుంటుంది.ఆ ప్రకారంగా చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.రంగు కుడా పోవు.

సాధారణంగా ప్యాట్లను ఉతికే టప్పుడు వాటిని వాషింగ్ మిషిన్ లో అలాగే వేస్తారు.దీని ద్వార ఆ ప్యాట్లకు వుండే జిప్పులు ఇతర దుస్తువులకు ఇరుక్కొని అవి కూడా పాడై పోతాయి.దీనిని నివారించాలంటే..ప్యాంట్ జిప్ ను పూర్తిగా పైకి లాగి జిప్ ను పై వైపుకు వచ్చేలా ఉంచాలి.

వాషింగ్ మిషన్లో దుస్తువులను వేసే టప్పుడు వాటి లోపలి వైపు బయటికి వచ్చేలా దుస్తువులను తిప్పి మిషన్లో వేయాలి. దిని ద్వార అవి మిషన్లో సులభంగా తిరుగుతాయి.మురికి కూడా వదిలిపోతుంది.

వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ ను సరైన మోతాదు లోనే వాడాలి.తక్కువగా వాడితే దుస్తువులు శుబ్రపడవు..అదే డిటర్జెంట్ ఎక్కువగా వాడితే అది అంత సులభంగా వదలదు.దిన్తో దుస్తువులను ఎక్కుసేపు ఉతకాల్సి వస్తుంది . దిని ద్వార దుస్తువులు పాడయ్యె అవకాశం వుంది.

మరకలు అంటిన దుస్తువులను విడిగా ఉతికితేనే మంచిది.లేదంటే ఆ మరకలు వేరే దుస్తువులకు అంటుకునే అవకాశం వుంటుంది.డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్ లెస్ సాఫ్ట్నర్ ను కుడా వాడటం ఉత్తమం.అది దుస్తువుల రంగును పోనివ్వడు.దీ ని తోడు దుస్తువులు ఎక్కువ కాలం మన్నుతాయి.

వాషింగ్ మిషిన్ పై వున్నా సెట్టింగ్స్ కచ్చితంగా పాటించాలి.ఏ ఏ దుస్తువులకు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకొని వాడితే దుస్తువులు ఎక్కువ కాలం మన్నుతా యి.

వాషింగ్ మిషిన్లో వున్నా డ్రై యర్ కంటే సహజ సిద్దంగా ఆరుబయట ఆరేయటం మంచిది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat