Home / MOVIES / ప‌ద్మావ‌త్ జెన్యూన్ రివ్యూ.. బాహుబ‌లిని కొట్టేసిందా..?

ప‌ద్మావ‌త్ జెన్యూన్ రివ్యూ.. బాహుబ‌లిని కొట్టేసిందా..?

రివ్యూ : ప‌ద్మావ‌త్

బ్యానర్ : వియాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌,పారామౌంట్ పిక్చ‌ర్స్‌

తారాగణం : దీపికా ప‌డుకొనె, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌,

కూర్పు : జయంత్ జధర్సం,  అకివ్ అలీ, సంజయ్ లీలా భన్సాలి

సంగీతం : స‌ంజ‌య్ లీలా బ‌న్సాలి

ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ

నిర్మాణం : సంజయ్ లీలా భన్సాలి, సుధాన్షు వాట్స్, అజిత్ అంధరె

రచన : సంజయ్ లీలా భన్సాలి, ప్రకాష్ కపాడియా

దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలి

విడుదల తేదీ: జనవరి 24, 2018

సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ ద‌శ‌నుంచే అనేక వివాదాల‌కు కేంద్రంగా మారిన ప‌ద్మావ‌త్ సినిమా జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా రిలీజ్ కానుంది. అయితే ఇప్ప‌టికే అన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోలు వేయ‌డంతో ప‌ద్మావ‌త్ టాక్ బ‌య‌ట‌కి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ హిస్టారిక‌ల్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దీపిక ప‌డుకొనే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి ఇన్ని వివాదాల‌తో అన్ని ఆటంకాల‌ను దాటుకుని వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

మహారాణి పద్మావతి మరియు సుల్తాన్ అల్లా వుద్దీన్ ఖిల్జీల కథ ఇది. ఓ హిస్టారిక‌ల్ సినిమాలో ద‌ర్శ‌కుడు బ‌న్సాలీ ఎమోష‌న‌ల్ సీన్ల‌ను హైలెట్ చేసిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. బ‌న్సాలీ సినిమాల్లో విజువ‌ల్స్ అద్భుతంగా ఉంటాయి. ప‌ద్మావ‌త్‌లోనూ అదే రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన దీపికా పదుకొనె – షాహిద్ కపూర్ – రణవీర్ సింగ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక అల్లా వుద్దీన్ ఖిల్జీ రోల్‌లో ర‌ణ‌వీర్‌సింగ్ జీవించాడు. అత‌డి న‌ట‌నే సినిమాకు మేజ‌ర్ హైలెట్‌. ఇక ఈ సినిమాకు వేసిన సెట్లు నాటి కాలం వాతావార‌ణాన్ని చ‌క్క‌గా ప్ర‌తిబింబించాయి.

ఇక ఈ సినిమా చ‌రిత్ర అంతా పూర్తిగా నార్త్ ఇండియాలో జ‌ర‌గ‌డంతో ద‌ర్శ‌కుడు ఎక్కువుగా ఉత్త‌రాది ప్ర‌జ‌ల ఎమోష‌న్స్ ఎలా ఉంటాయో.. అదే రేంజ్‌లో తెర‌కెక్కించాడు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో.. చెప్ప‌లేం. ఇలాంటి హిస్టారిక‌ల్ సినిమాల‌కు యుద్ధ స‌న్నివేశాలే హైలెట్‌. ప్రేక్ష‌కులు ఎక్కువుగా యుద్ధ స‌న్నివేశాల‌ను ఆస్వాదించేందుకే ఇలాంటి సినిమాలు చూడాల‌నుకుంటారు. మ‌నం బాహుబ‌లి సినిమాతో చూసిన యుద్ధాల‌తో పోలిస్తే ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు చాలా వీక్‌. ద‌ర్శ‌కుడు యుద్ధ స‌న్నివేశాల క‌న్నా న‌టీన‌టుల నుంచి న‌ట‌న‌తో పాటు ఎమోష‌న్స్‌ను బాగా హైలెట్ చేశాడు. ఫైన‌ల్‌గా చెప్పాలంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు యావ‌రేజ్‌గా న‌చ్చే ఈ సినిమా నార్త్‌లో మాత్రం బాగా ఆడ‌వ‌చ్చు.

ఇక ముఖ్యంగా ఈసినిమాకు మెయిన్ ప్ల‌స్ పాయింట్ ఏంటంటే సంజ‌య్ లీలా బ‌న్సాలి విజ‌న్‌.. దీపిక, షాహిద్‌ల మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ డ్రామా ప్రేక్ష‌కుల హార్ట్‌ని తాకుతోంది. ప‌ద్మావ‌త్ క్యారెక్ట‌ర్‌కి దీపిక‌ను తీసుకోవ‌డంతోనే స‌గం స‌క్సెస్ అయిన  భన్సాలి ఆమె క్యారెక్ట‌ర్‌ను తీర్చిదిద్ద‌డంతో పుల్ స‌క్సెస్‌ను సాధించారు. ఇక ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమాకే హైలెట్‌.. ఇక ఆర్ట్ వ‌ర్క అయితే అదిరిపోయింది. ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ అయితే బ‌య‌ట‌కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడు అదే మూడ్‌లో ఉండ‌డంతో సంజ‌య్ పూర్తిగా స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పొచ్చు. ఇక మైన‌స్ పాయింట్స్ విష‌యానికి వ‌స్తే.. కొన్ని కీల‌క స‌న్నివేశాలు తేలిపోవ‌డం, యుద్ధ స‌న్నివేశాలు అంత గొప్ప‌గా లేక‌పోవ‌డం, మాస్ ఆడియెన్స్‌కు పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఏది ఏమైనా జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లిని ట‌చ్ చేసే సీన్ సంజయ్ లీలా భన్సాలి ప‌ద్మావ‌త్‌కు లేద‌ని ప్రేక్ష‌కులు తేల్చేశారు.

రేటింగ్ : 3/5

ద‌రువు పంచ్ లైన్ : బాహుబ‌లిని ట‌చ్ చేయ‌ని… భన్సాలి చెక్కిన‌ మ‌రో చ‌రిత్ర‌

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat