Home / ANDHRAPRADESH / జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..

జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ పార్టీతో మిత్రపక్షంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికలసమయంలో మిత్రపక్షంగా పోటిచేసిన ఇరు పార్టీలు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించాయి.అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ఎప్పటికప్పుడు స్పెషల్ రిపోర్టు తెప్పించుకుంటున్న మోదికి రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ నేతలు టీడీపీ సర్కారుపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ,కేంద్రం ప్రవేశపెట్టి మరి అమలు చేస్తున్న పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేస్కోవడంపై రాష్ట్ర నేతలు రిపోర్టు చేశారు.అంతే కాకుండా  ప్రముఖ జాతీయ మీడియా రిపబ్లిక్ టీవీ ,సీ వోటర్ నిర్వహించిన సర్వేలో కూడా టీడీపీ కంటే వైసీపీ పార్టీ పుంజుకుందని రుజువు అయింది.

అయితే నిర్ణిత సమయం కంటే ముందుగానే ఎన్నికలకు పోవాలని భావిస్తున్న మోదీ ఇలాగే టీడీపీ పార్టీతో కల్సి పోటి చేస్తే తమపై ఆ ప్రభావం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీతో జత కలిస్తే ఎలా ఉంటుందనే అంశం మీద మోదీ జాతీయ పార్టీ నేతలతో అన్నట్లు కమలం నేతలు చర్చించుకుంటున్నారు.అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో కల్సి పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఒకవైపు జగన్ చెప్పడంతో బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తుందని ఆ పార్టీ నేతలు గుస గుసలాడుకుంటున్నారు.అయితే చూడాలి మరి జనవరి 26న మోదీ ఆలోచించిన నిర్ణయం కార్యరూపం దాల్చిస్తే బాబుకు చేదు కబురు ..జగన్ కు తీపి కబురు అవుతుంది కదా ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat