తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, తన భార్య రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ( కేసీఆర్ ,కవిత ,హరీష్ రావు ) రాజకీయాల నుంచి తప్పుకుంటారా ..? సవాల్ విసిరారు.
see also : విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జగన్ ఏం చెప్పాడు భయ్యా..?