Home / ANDHRAPRADESH / 2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!

2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!

ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు.వినడానికి ఇది రొటీన్ ఆర్టికల్ అయిన కానీ ఇదే నిజమంటున్నారు ఏపీ పాలిటిక్స్ వర్గాలు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం మరో రెండు నెలల్లో పూర్తికానున్నది .

మరల కాంగ్రెస్ పార్టీ తరపున నుండి ఇటు లోక్ సభకు ఎన్నికై అవకాశం కానీ అటు రాజ్యసభకు కానీ వెళ్ళే వీలు ఇప్పట్లో లేదు.అంతే కాకుండా మరో ఇరవై ఏండ్లు ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదు .ఇలాంటి తరుణాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు అని ఏపీ రాజకీయ వర్గాల ఇన్నర టాక్ .అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను నిర్వహిస్తున్న దగ్గర నుండి మరల 2009 ఎన్నికల్లో వైఎస్ అధికారంలోకి రావడానికి ..పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కీలక పాత్ర పోషించారు అని కూడా అప్పుడు చర్చించుకున్నారు.అప్పట్లో వైఎస్ కాంగ్రెస్ మాజీ మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి ,సాయి ప్రతాప్ ,కేవీపి లను ఎక్కువగా నమ్మేవారని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ .

అంతగా తన తండ్రికి ఉపయోగపడ్డ ఈ ముగ్గురు నేతలు అప్పట్లో జగన్ కాంగ్రెస్ పార్టీను వీడి సొంతగా పార్టీ పెట్టినప్పుడు ఆశీర్వదించారు కానీ ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేదు.అంతకుమించి కెవిపి మీడియా మొఘల్ రామోజీ రావును జగన్ దగ్గరకు కూడా చేర్చారు .అట్లాంటి మహానేత అయిన కెవిపిను వైసీపీలోకి ఆహ్వానించి పెద్దల సభకు పంపించి అయన సేవలను పార్టీ బలోపేతానికి ..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు.ఇందుకు తగ్గట్లే కెవిపి ,విజయమ్మ ,జగన్ ఒక్కసారి సమావేశమయ్యారు అని సమాచారం .త్వరలో రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన తర్వాత వైసీపీలో చేరి జగన్ కు అండగా ఉండాలని కూడా అప్పట్లో విజయమ్మ కెవిపికి సలహా ఇచ్చారు అంట .అయితే ఆ మహానేత వైఎస్ సతీమణి అడగటంతో కూడా అన్ని అలోచించి ఎంపీ పదవీ కాలం పూర్తైన తర్వాత పార్టీలోకి వస్తాను అని అప్పుడే హామి ఇచ్చారు అంట కెవిపి .దీంతో ఆయన పార్టీలో చేరితే వైసీపీకి అధికారం ఖాయం..జగన్ సీఎం అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat