Home / SLIDER / తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి సర్కారు తీపీ కబురును అందించింది.అందులో భాగంగా రాష్ట్ర హోంశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

వీటిలో సివిల్ కానిస్టేబుల్ 5002, స్పెషల్ కానిస్టేబుల్ 3372, ఏఆర్ కానిస్టేబుల్ 2283, ఎస్‌ఐ సివిల్ 710, ఎస్‌ఐ ఏఆర్ 275, ఎస్‌ఐ స్పెషల్ పోలీసు 191, కమ్యూనికేషన్ ఎస్‌ఐ 29, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 142, సీసీఎల్ కానిస్టేబుల్ 53, సీటీవో కానిస్టేబుల్ 89, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ 26 పోస్టులతోపాటుగా అన్ని విభాగాల్లో మొత్తం ఎస్‌ఐ పోస్టులు 1210, కానిస్టేబుల్స్ 12,941, ఏఎస్‌ఐ పోస్టులు 26 ఉన్నాయి.అయితే ఈ పోస్టులను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat