Home / SLIDER / మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతం-మంత్రి చందూలాల్

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతం-మంత్రి చందూలాల్

దేశ వ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనసందోహంతో జనారణ్యంగా మారి కళకళలాడిన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వన దేవతలు మళ్లీ వన ప్రవేశం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతరకు గతంలో కంటే మిన్నగా కోటి 25 లక్షల మంది భక్తులు సందర్శించుకుని బంగారంతో మొక్కులు సమర్పించుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. ఈ సారి మేడారం జాతరలో హరితహోటళ్లు, విలాసవంతమైన గుడారాలు, ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియం ఏర్పాటు చేయడంతో భక్తుల పెద్ద ఎత్తున పోటెత్తారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజల నుంచి జాతర ముగిసే వరకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు చిన్న అసౌకర్యం కూడా లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం అభినందనీయం. మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ. 80 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈసారి జాతరలో భక్తులకు తాగునీటి వసతి, టాయిలెట్స్‌ను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసింది. .

ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్న కారణంగా కాలుష్యం తలెత్త కుండా పారిశుద్ధ్యం పనులు కూడా ఎప్పటికప్పుడు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మేడారం జాతరకు భక్తులతో పాటు విఐపీల తాకిడి పెరిగింది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ తదితరులు మేడారం సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సిద్దించిన తరువాత సీఎం హోదాలో తొలిసారిగా వచ్చిన సీఎం కేసీఆర్ మేడారంపై వరాల జల్లు కురిపించారు. మేడారం అభివృద్ధికి రూ. 200 కోట్లు ప్రకటించారు. మేడారంలోని వనదేవతల ప్రాంగణం వద్ద ఇరుకుగా ఉన్నందున 200 నుంచి 300 ఎకరాల వరకు భూమి సేకరించాలని సూచించారు. వచ్చే జాతరలోగా మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం అభినందనీయమని మంత్రి చందూలాల్ అన్నారు.

మేడారం అభివృద్ధిలో భాగంగా భక్తులు జంపన్నవాగుపై డ్యామ్ నిర్మించి, మంచినీళ్లతో స్నానం చేపట్టే విధంగా శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మేడారం అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర గిరిజన అభివృద్ధి, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖమాత్యులు అజ్మీరా చందూలాల్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేడారం జాతర విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రత్యేక అధికారి మంచిర్యాల కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వి. కర్ణన్‌, ఎస్పీ భాస్కరన్‌ ఇతర అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు విస్తృత ప్రచారం కల్పించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే మేడారం జాతర కల్లా శాశ్వత నిర్మాణాలు చేపట్టి మేడారం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి చందూలాల్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat