తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’’ వంటి తెలంగాణపై బ్రీత్లెస్ సాంగ్‌ని రూపొందించిన బందూక్ మూవీ టీం గోరటి వెంకన్న సాహిత్యం, కార్తీక్ కొడకండ్ల సంగీతం, సాకేత్ కొమండూరి గానం, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో తెలంగాణ మట్టిపాట. ‘‘వీరాధి వీరుడు అతడు..’’ అంటూ సాకేత్, రేవంత్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, కృష్ణ చైతన్య, సాయి చరణ్, శంకర్ బాబు, నూతన, సోనీ, హరిణి, హారిక, శరణ్య, ధృతి, సిద్ధార్థ్, సంపత్ వంటి వారితో కలిపి మొత్తం 18 మంది సింగర్స్ ఈ పాటను అలపించారు. ఈ పాటకు సంబంధించిన టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా ఫిబ్రవరి 17న ఈ పాటను విడుదల చేయబోతున్నారు.