Home / NATIONAL / టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా కే.సి.ఆర్ జన్మదిన వేడుకలు.

టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా కే.సి.ఆర్ జన్మదిన వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ గారి ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు జరిపించారు, సాయంత్రం బ్రేబ్రూక్ లో జన్మ దిన వేడుకలు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు.

ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల గారు మాట్లాడుతూ, కె సి ఆర్ గారి మరియుటి ఆర్ ఎస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని, ఆస్ట్రేలియా నలుమూలాల మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారనీ,తెలంగాణ పునర్నిమాణంలో తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సర్వదా సిద్ధమని, ఆ దిశలోనే పలు కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టినామని తెలిపారు,బంగారు తెలంగాణను సాధించే దశలో కె సి ఆర్ గారు చేస్తున్న కృషిని , దేశానికి వెన్నెముకైన రైతును రాజునుచేయ తలపెట్టిన దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’ ఒక అద్భుతమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ బీళ్లన్ని, పాడి పంటలతో సస్యశ్యామలమయ్యే ఒక మహత్కార్యమన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని, తెలంగాణ ప్రజల దాహాన్ని తీర్చే మిషన్ భగీరథ, రైతులకు సబ్సిడీలు, వృద్ధాప్య ఫించన్లు, బడుగు, బలహీన వర్గాలకు, విద్యార్థులకు ,గర్భిణీ స్త్రీలకు మరియు మైనార్టీలకు, వివిధ రకాలుగా చేయూత శ్రీ కె సి ఆర్ గారి రాజకీయ నిబద్ధతకు తర్కాణమన్నారు. విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడానికి నడుం బిగించిన శ్రీ కె సి ఆర్ గారి ఉక్కు సంకల్పాన్ని,ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ అభివృద్ధి పథకాల గొప్పదనాన్ని సామాజిక మాధ్యమాల ద్వార ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణ బిడ్డలకు చేరేవిధంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా కృషి చేస్తుందని పేర్కొన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి, నేడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న కె సి ఆర్ గారు దీర్గాయుష్యుతో వర్ధిలాల్లని సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి ‘లాంగ్ లీవ్ కె సి ఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంబరాలు రవి సాయల ఆధ్వర్యంలో కాన్బెర్రాలో,
టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు మరియు విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో సిడ్నీలో ,శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రిస్బేన్ లో ఘనంగా నిర్వహించారు.మెల్బోర్న్ లో జరిగివేడుకలలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులుసత్యం, అమర్ చీటీ, అర్జున్ ,ప్రవీణ్ లేడల్లా,సనీల్,నితిన్,సాయి యాదవ్, వేణు నాథ్, రాకేష్ గుప్తా,రామ్ యాదవ్, హేమంత్, సతీష్, యశ్వంత్,విశ్వామిత్ర,నిశాంత్,మైనార్టీ నాయకులు జమాల్ అభిమానులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat