తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రజలు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.కొన్ని చోట్ల రక్తదానాలు ,మరికొన్ని చోట్ల అన్నదానాలు ఇలా పలు విధాలుగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఆయన తనయుడు ,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ,తనయ ఎంపీ కవిత
వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే డ్యాడీ ..మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Happy Birthday Dad ?
Wish you many many years of good Health & loads of Happiness pic.twitter.com/6tM9zCHzUq
— KTR (@KTRTRS) February 16, 2018
మరో వైపు ఎంపీ కవిత తన తండ్రిపై అద్భుతమైన కవితను పోస్టు చేస్తూ డియర్ ఫాదర్ మీ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వపడుతున్నాను ..మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం అని ట్వీట్ చేశారు ..
Happy Birthday Dear Father !! Proud to be your follower & Blessed to be your Daughter ? pic.twitter.com/1Xdj3EEJRF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2018