Home / SLIDER / డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్

డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్

తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న మంత్రి… కరీంనగర్, వరంగల్‌లో ఐటీ సేవలను విస్తరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణమని ఈ సందర్భంగా చెప్పారు.

see also : బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో పారిశ్రామిక వేత్త‌.. ఇక ఆ జిల్లాలో టీడీపీ చాప్ట‌ర్ క్లోజే..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat