తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని..నర్సింగ్ సమాజం తరుపున ప్రగతి భవన్ లో నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను రాథోడ్ సీఎం కేసీఆర్ గారిని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిండు నూరేళ్ళు అయురోగ్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందంగా ఉండాలని ..రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలని ఆయన కోరుకున్నారు.