Home / ANDHRAPRADESH / ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..!

ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర మ‌రో మైలురాయికి చేరుకుంది. న‌వంబ‌ర్ 6న మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర పిబ్ర‌వ‌రి 28న సెంచ‌రీ కొట్టింది. ఇప్ప‌టికే 1350 కి.మీ పైగా సాగిన జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి రెండు రోజులు బ్రేక్ ఇవ్వ‌నున్నార‌ని వైసీపీ వ‌ర్గీయులు తెల్పుతున్నారు.

see also : జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

ఇప్ప‌టికే ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం.. జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ రాష్ట్ర రాజ‌కీయాల‌తోపాటు, దేశ రాజ‌కీయాల్లో కూడా హీట్ పెంచిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌త్యేక‌హోదా కోసం అవ‌స‌ర‌మైతే ఎంపీల రాజీనామాకి కూడా సిద్ధ‌మ‌ని.. రాజీనామా డేట్‌తో స‌హా డెడ్‌లైన్ ప్ర‌క‌టించారు జ‌గ‌న్. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల‌కోసం ఏపార్టీతో అయినా ముందుకు వెళతామే గానీ.. ప్ర‌త్యేక‌మోదా విష‌యంలో మాత్ర త‌గ్గ‌మ‌ని జ‌గ‌న్ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

see also :అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..! రూ.3,300 కోట్ల లెక్క‌ల‌పై త‌డ‌బాటు..!!

అందులో భాగంగానే ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. మార్చి 1న 13 జిల్లాల‌ కలెక్టరేట్లను ముట్ట‌డించ‌నున్నారు. ఈ విష‌యాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఈ మేరకు మీడియాకు వివరాలందించారు. అంతేకాకుండా మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టనుంది. కలెక్టరేట్ల ముట్టడి పిలుపు నేపథ్యంలో జగన్‌ గురువారం పాద‌యాత్ర‌కు విరామం ఇవ్వనున్నారు. ఇక ఈ క‌ల‌క్టరేట్ల‌ ముట్ట‌డికి ప్రజలతో కలిసి వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన‌నున్నారు. ఇంకో ముఖ్య‌విష‌యం ఏంటంటే పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాల్లో పాల్గొనేందుకుగాను మార్చి 3న వైసీపీ ఎంపీలు ఢిల్లీకి బ‌య‌లుదేర‌నున్నారు.

see also :పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్

see also :జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat