Home / CRIME / తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!

తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!

పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్‌గా ఉన్నారు.

అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ జీ ఇయున్‌ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీటూ ఉద్యమంలో పాల్గొన్న బాధితురాలు.. తనకు జరిగిన అన్యాయం పట్ల ఆన్‌లైన్‌లో ప్రచారం చేశారు. గడిచిన ఎనిమిది నెలల్లో.. గవర్నర్ అహన్ హీ జంగ్ తనను నాలుగుసార్లు రేప్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ వార్తలు ఆ దేశంలో సంచలనం రేపాయి. అయితే తాజాగా గవర్నర్ అహన్ ఆ ఆరోపణలను అంగీకరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫూలిష్‌గా ప్రవర్తించానని, తనను క్షమించాలంటూ ఆ పోస్ట్‌లో గవర్నర్ వేడుకున్నారు. తప్పంతే తనదే అని, ఇక తన రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో అహన్ పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో మూన్ చేతిలో ఆయన ఓడారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat