Home / SLIDER / రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్

రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..కేసీఆర్

రైతులకు రూ.8 వేల పెట్టుబడి సాయం ఇవ్వనున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని..ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు చేయూత అందిస్తామన్నారు.

see also :తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం పెడుతున్నామన్న ఆయన..బీజేపీ పాలిత 20 రాష్ట్రాల్లో ఇలాంటి పథకం లేదన్నారు. ఆశా వర్కర్లకు కూడా జీతాలు పెంచబోతున్నామన్నారు. కల్యాణలక్ష్మీ సాయం, ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటుందని … కేసీఆర్ కిట్లతో 2 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రసవాలు పెరిగాయన్నారు.

see also :సీఎం కేసీఆర్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే ..!

పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. ఎవరైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలన్నారు. టెండర్లలో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు నిరూపించాలని తెలిపారు. నిరాధార ఆరోపణలు తప్ప ఒక్క అవినీతి నిరూపించలేదన్నారు. మిషన్‌ కాకతీయ కింద 17వేల చెరువులు బాగుపడ్డాయని, మరో 7వేల చెరువుల మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు.దేశంలో తొలిసారి శాసనసభ్యులను గౌరవించింది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat