గత వారం రోజులనుండి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి ఇటు సోషల్ మీడియా..అటు టీవీ చానెళ్లో ఒకటే చర్చ జరుగుతుంది. తాజాగా ఒక టీవీ చానల్ లో జరిగిన చర్చలో నటి శ్రీ రెడ్డి, ప్రసన్నకుమార్ అనే నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సువల్ ఫేవర్స్ చేయకుంటే.. సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్సే లేదని వీళ్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్లకు కూడా నిబంధన వర్తిస్తుంది అని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించారు. కొంతమంది సెక్సువల్ ఫేవర్స్ అందించి కూడా మోసపోతారని.. ఆమె వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఇంకా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందామె.
ఇక ఇదే అంశంపై ప్రసన్నకుమార్ స్పందిస్తూ… ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మామూలే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలా మంది హీరోయిన్లే ఈ తరహాలో వ్యవహరించడానికి సిద్ధంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించాడు. తనకు తెలిసిన ఒక పెద్ద హీరోయిన్ ఈ విషయంలో అలాగే వ్యవహరించిందన్నాడు. ఒక ప్రముఖ హీరో సినిమాలో ఛాన్స్ సంపాదించడానికి ఆమె.. అన్ని రకాలుగానూ ప్రయత్నిచిందన్నాడు. చివరకు పడక సుఖం అందించి ఆ హీరో సరసన అవకాశాన్ని సంపాదించడానికి కూడా ఆమె వెనుకాడలేదు అని ఆయన వ్యాఖ్యానించాడు. ఆమె పేరేమిటో ఈయన చెప్పలేదు. ఆమె పేరు ‘ర’అనే అక్షరంతో మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ టాపిక్ గా మారింది.