Home / ANDHRAPRADESH / వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!

వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన అగ్రనటుడు కూడా వైసీపీలో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటు సినీ అటు పాలిటిక్స్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.

See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో చంద్రబాబు &బ్యాచ్ …!

ఇండస్ట్రీలో ముఖ్యుడైన మన్మధుడు అక్కినేని నాగార్జున త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి.అక్కినేని కుటుంబానికి వైఎస్ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉన్నదనే సంగతి తెల్సిందే.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మీద ప్రేమతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రచార చిత్రాల్లో కూడా నటించారు.దివంగత సీనియర్ నటుడు సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా వైఎస్ కుటుంబం అంటే కూడా ఎనలేని ప్రేమ అని అప్పట్లో ఆయనే స్వయంగా కూడా చెప్పారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేయాలనీ భావించిన కానీ తన కుమారుల సినీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు నాగ్ సన్నిహితులు అంటుండేవారు.

See Also:నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!

అయితే తాజాగా వైసీపీ ఎన్నికల వ్యుహ్యా కర్త అయిన ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు వైసీపీ శ్రేణులు నాగ్ ను సంప్రదించినట్లు సమాచారం.వారు కలవగానే మీరు ఎప్పుడు రమ్మంటే ..అప్పుడు వస్తాను ..మీ కష్టమే నాకష్టం ..మీకు అండగా నేను ఉంటాను ..ప్రజలు బాగుంటారని మీరు భావిస్తే నేను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధం ..ప్రస్తుతం కొన్ని సినిమాలు చేతుల్లో ఉన్నాయి .అవి పూర్తికాగానే నా నిర్ణయం స్వయంగా మీడియాకు ప్రకటిస్తాను అని హామీ ఇచ్చాడు అంట నాగ్ .

See Also:శంషాబాద్‌ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం.. ఎమ్మెల్యే రోజా సహా మరో 70 మంది..

అంతే కాకుండా వైసీపీ తరపున విజయవాడ నుండి ఎంపీగా బరిలోకి దిగాలని వైసీపీ శ్రేణులు కోరగా దానికి సరే అన్నాడు అంట నాగ్.ప్రస్తుతం రాజధాని పరిసర ప్రాంతాల్లో నాగ్ లాంటి వారు కావాలని పీకే సూచించిన సలహా మేరకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం వర్మతో చేస్తున్న ప్రాజెక్టు పూర్తికాగానే వైసీపీ కండువా కప్పుకుంటారు నాగ్ ..

See Also:ఎంపీ విజయసాయి రెడ్డిని బుక్ చేయబోయి మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat