Home / ANDHRAPRADESH / గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!

గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!

ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులూ వైసీపీలో కి వస్తున్నారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సీమాంధ్ర ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు, కృష్ణా జిల్లాలపైన మాత్రం దృష్టి పెడుతున్నాడన్న విషయం కంటికి కనిపిస్తున్న నిజం. బాబుతో పాటు తెలుగు దేశం నాయకులందరూ కూడా ఈ సారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి స్వీప్ ఖాయమని నమ్ముతున్నారు. అలాంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న భారీ ప్రజా స్పందన టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. రాయలసీమ జిల్లాలో జగన్‌కి వచ్చిన స్థాయి స్పందన పల్నాడులో కూడా వస్తుండడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

see also..

దమ్ముంటే రాజీనామా చేసి గెలువు -అఖిల వర్సెస్ సుబ్బారెడ్డి ..

అయితే అధికారంలో ఉన్న పార్టీలోకి జంపింగులు కామన్ వ్యవహారమే. ఆర్థిక లాభాలతోపాటు ఇతర లాభాలు ఎన్నో ఉంటాయి కాబట్టి. కానీ అధికార పార్టీలో సత్తెనపల్లి నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నేత వైకాపాలో చేరడం మాత్రం 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని నాయకులు కూడా ఏ స్థాయిలో నమ్ముతున్నారు అన్న విషయం తెలియచేస్తోంది. ఇక తాజాగా టీడీపీలో ప్రజా బలం ఉన్న నాయకులుగా పేరున్న తెలుగుదేశం బిసీ నాయకులు అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ బిసి నాయకులు గోళ్ళ శివ శంకర్ యాదవ్, గంపా నరసింహారావులు వైసీపీలో చేరారు. టీడీపీకి బలం ఉన్నచోటనే జగన్ పాదయాత్రకు భారీగా ప్రజా స్పందన దక్కుతుండడం….అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలేని వైసీపీలో చేరుతూ ఉండడం మాత్రం 2019ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్‌ని తెలియచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

see also..

నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat