Home / MOVIES / రంగస్థలం రివ్యూ

రంగస్థలం రివ్యూ

చిత్రం: రంగస్థలం
నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు
కూర్పు: నవీన్‌ నూలి
కళ: రామకృష్ణ, మౌనిక
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌
సాహిత్యం: చంద్రబోస్‌
రచన: తోట శ్రీనివాస్‌.. కాశీ విశాల్‌.. బుచ్చిబాబు.. శ్రీనివాస్‌ రంగోలి
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి
దర్శకత్వం: సుకుమార్‌
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల: 30-03-2018 శుక్కవారం
ఊర మాస్ గ్రామీణ పాత్రలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది – లెక్కల మాష్టారు సుకుమార్ దర్శకత్వంలో ,మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం . ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది 1985 నాటి కాలంలో సాగే కథ. భూస్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం.. 30ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ ప్రెసిడెంట్‌ చేసే అరాచకాలను నిలదేసే ఓ యువకుడు.. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ కాన్సెప్ట్‌ గతంలో ఎన్నో చిత్రాల్లో మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి కథకు సుకుమార్‌ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే ‘రంగస్థలం’. కథ పరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం, ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో సాగుతుంది. రంగస్థలం అనే ఊరిలో ఊరి ప్రెసిడెంట్( జగపతిబాబు) పరమ దుర్మార్గుడు. ప్రభుత్వ వ్యవసాయ సొసైటీని సొంత ఆస్తిలాగా భావిస్తూ, అధిక వడ్డీలకి అప్పులు ఇస్తూ, ప్రజలని పీడిస్తుంటాడు. అదే ఊరిలో చిట్టిబాబు( రామ్ చరణ్), డీజిల్ ఇంజిన్ ద్వారా పొలాలకి నీళ్ళు పెడుతూ జీవిస్తుంటాడు. రామలక్ష్మి(సమంతా) తో లవ్ లో పడతాడు. రంగస్థలం లో కాస్త చదువుకున్న కుర్రాడు, చిట్టిబాబు అన్న కుమార్ బాబు (ఆది) సర్పంచ్(ప్రెసిడెంట్) ఎన్నికల్లో జగపతిబాబు పై పోటీ చేస్తాడు. 30 ఏళ్లు ఎదురులేకుండా ప్రెసిడెంట్ గిరీ చలాయించిన జగపతిబాబు ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేసాడు? ఈ పోరాటంలో చిట్టిబాబు ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.

 

ఇక సినిమా టైటిల్స్ నుండి ఇంటర్వెల్ దాకా, గ్రామీణ అందాలు, సరదాలు, పాటలతో అస్సలు టైమే తెలియకుండా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. పంచాయితీ ఎన్నికల లో బలవంతుడు అయిన ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఒక సామన్యుడు పోటీ చేయబోతున్నాడు అనే దానితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథ కొంచెం స్లో అయింది, జిగేలు రాణి పాటతో పూజ హెగ్డే వచ్చి, మళ్ళీ ప్రేక్షకులకి ఊపు తీసుకొచ్చేదాక సినిమా కొంత డల్ గా అనిపిస్తుంది. ఐటెం సాంగ్ తర్వాత కథలో వేగంగా పెరిగినా, ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా అనిపించదు. ఇక క్లైమాక్స్ దగ్గరకి వచ్చే టప్పటికి సుకుమార్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో సినిమా ముగించాడు. మొత్తం మీద సెకండ్ హాఫ్ లో ఓ 30 నిమిషాలు తప్పా సినిమా అంతా బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మైత్రీ మూవీస్ వాళ్ళు ఖర్చు కు వేనకాడలేదు. అయితే పెట్టిన ప్రతి పైసా తెరమీద ప్రేక్షకులకి కనువిందు చేసింది. పాటల రచయిత చంద్రబోస్ చాలా ఏళ్ల తర్వాత మంచి సాహిత్యం అందించారు.
ఇక నటి ,నటుల విషయానికి వస్తే 980 ల నాటి గ్రామీణ యువకుడి పాత్రలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మన్సు ఇచ్చాడు. కాస్త చెవుడు ఉన్న వ్యక్తిగా కామెడి పండిస్తూనే, ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. ఇక రామలక్ష్మిగా సమంత చాలా అందంగా కనిపించింది. ఆది ఎప్పటిలాగానే పాత్రలో జీవించేసాడు. జగపతిబాబు కి ఇలాంటి క్యారక్టర్స్ కొట్టినపిండి. రంగమ్మత్త గా అనసూయ కొత్తగా కనిపించింది. ప్రకాష్ రాజ్ సహా మిగతా ఆర్టిస్ట్ లంతా ఓకే .

చివరగా చెప్పాలి అంటే..?

మామూలు కథే అయినా, దానికి మంచి గ్రామీణ నేపథ్యం , హీరో పాత్రకి వినికిడి లోపం అనే ఆకర్షణలు కలిపి తీసిన మంచి కమర్షియల్ సినిమా రంగస్థలం
బలాలు
+ రామ్‌చరణ్‌ నటన
+ పాత్రలను చిత్రించిన విధానం
+ ట్విస్ట్‌లు
+ పాటలు, నేపథ్య సంగీతం
బలహీనతలు
– ప్రథమార్ధం కాస్త మందమనం
దరువు ట్యాగ్ లైన్- రంగస్థలంలో రామ్ చరణ్ గెలిచాడు.
రేటింగ్ –3.2/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat