Home / MOVIES / పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని సమంత జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా రంగస్థలం.ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.అయితే సోమవారం చెర్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా చూశారు.

ఈ సందర్భంగా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.రంగస్థలం చాలా అద్బుతమైన సినిమా అని ..రామ్ చరణ్ చాలా బాగా నటించాడని చెప్పారు.తొలి ప్రేమ మూవీ తరువాత తానెప్పుడు బయటకు రాలేదని..కానీ రంగస్థలం సినిమాను థియేటర్‌లో చూడాలనిపించిందని తెలిపారు.

అంతేకాకుండా రంగస్థలం నా మనస్సు కు బాగా నచ్చిన సినిమా అని ..అన్ని విషయాలు సినిమా సక్సెస్ మిట్ లో మాట్లాడుతానని స్పష్టం చేశారు..దీంతో రంగస్థలం సినిమా సక్సెస్‌మీట్‌కి పవన్ కళ్యాణ్ వస్తున్నారని స్పష్టంగా తేలిపోయింది. అయితే పవన్‌ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారని సమాచారం. ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ , చిరంజీవి ,రామ్ చరణ్ కనిపిస్తే.. అభిమానులకు ఇక పండుగే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat