ప్రముఖ టాలీవుడ్ విలక్షణ నటుడు ,సీనియర్ నటుడు అయిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు శుక్రవారం నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు.
అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి మాజీ ప్రధాని దేవెగౌడ్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది .ప్రస్తుతం దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశానికి మార్పు చాలా అవసరం ..
అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యమవుతుందని ఆయన అన్నారు .గత డెబ్బై ఏళ్ళుగా ఏ నేత ,ఏ పార్టీ ఎన్నికల హామీలు కురిపించారో ..ఎవరు ఇచ్చిన హామీలను నేరవేర్చారో ప్రజలు గుర్తించాలని కోరారు ..దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భయమేస్తుందని ఆయన అన్నారు ..