తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో కల్సి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ప్రెండ్ అని అన్నారు .
గతంలో పాలించిన ,ప్రస్తుత పాలిస్తున్న కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పట్ల దేశ ప్రజలు విరక్తి చెంది ఉన్నారు .వారు మార్పును కోరుకుంటున్నారు .ప్రస్తుతం సమాజంలో వెనకబడిన వర్గాల కోసం పాటుపడుతున్న హీరో ప్రకాష్ రాజ్ అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు .ప్రస్తుతం సమాజం గురించి నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న సేవ ,పలు కార్యక్రమాలు దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ..