Home / ANDHRAPRADESH / కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది

కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు .

ఓటుకు నోట్లు ఇచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబును శిక్షించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ‘బ్రీఫ్డ్‌’ అన్న వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్థారించిందని, ఈ ఆధారాలు బట్టి బాబును అరెస్ట్‌ చేయాలని కోరారు.చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందంటూ ఆమె ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని ఈ సందర్భంగా ఆరోపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat