ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .
ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖను ఇటు తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ,ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో రాజీనామా సీనియర్ న్యాయ లేఖను పంపించారు బ్రహ్మయ్య ..