Home / LIFE STYLE / నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!

నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!!

మన శరీరం లో ప్రతి ఒక అవయవానికి ఉపయోగాపడే వస్తువు నిమ్మకాయ….తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఉండేది నిమ్మకాయలోనే …….
మరి అటువంటి నిమ్మరసాన్ని ఎలా ఉపయోగించాలి, దీని వల్ల ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దామా…
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటిమిన్ “సి” పుష్కలంగా ఉంటాయి…..
అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు… ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవాళ్ళు రోజు కి ఒక నిమ్మకాయని వాడితే శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.

యవ్వనం కోసం….

నిమ్మరసం యవ్వనంగా ఉండేలా చేస్తుంది: నిమ్మపండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల, మనం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా కనబడుటకు బాగా సహాయపడుతుంది.

బరువు తగ్గాలా..!

అయితే ఒక నిమ్మకాయ ఉంటే చాలు…
చాలామంది బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైన ఔషదంగా పని చేస్తుంది.
కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపున తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది…నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి.

నిమ్మకాయ తో తెల్లటి పళ్ళు మీ సొంతం….!!

దంతాలను మెరిపిస్తాయి. నిమ్మతొక్కతో దంతాల మీద రుద్దడం వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్ చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.

మచ్చలు లేని మేరేసే ముఖం కోసం ఒక నిమ్మకాయ…..!!!

నిమ్మకాయ రసం ముఖంపై ఉన్న మచ్చల తో పాటు శరీరం పై ఉన్న మచ్చలను కూడా తీసేస్తుంది..ఒక స్పూన్ నిమ్మ రసాన్ని తీసి మొటిమల మచ్చల పై రాస్తే ముఖంలొ మచ్చలు కనిపించవు. ఇలా వారం రోజులు పాటు మూడు నిమిషాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది…..నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది…..!!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat