Home / NATIONAL / జేబులోనే పేలిన ఫోన్.. వీడియో వైరల్‌

జేబులోనే పేలిన ఫోన్.. వీడియో వైరల్‌

ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్స్ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరి వద్ద ఫోన్ పేలుతుందోనన్న టెన్షన్‌ చాలామందిని వెంటాడుతోంది. ఛార్జింగ్ పెట్టినప్పుడుగానీ, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుగానీ, జేబులో పెట్టుకున్న తర్వాతగానీ పేలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాందప్‌ ప్రాంతం ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్‌ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన 4న జరగ్గా రెస్టారెంట్‌లోని సిసిటివి చిత్రీకరించింది. ఓ వ్యక్తి చొక్కా జేబులో ఉన్న ఫోన్‌ ఒక్కసారిగా పేలి పొగలు రావడంతో, అతను వెంటనే పేలిన ఫోన్‌ తీసి కింద పడేయంతో రెస్టారెంటులో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. ఫోన్‌ జేబులో పేలడంతో ఆ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat