రష్మీ ,సుధీర్ గతంలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన పేర్లు .బుల్లితెరపై ప్రతి శుక్రవారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా సుధీర్ కంటెస్ట్ గా వస్తున్నా సంగతి తెల్సిందే .తెరపై వీరిద్దరూ చేసే హడావుడి చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకున్నారు.
అందరూ అనుకున్నట్లే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు కూడా తెగ హాల్ చల్ చేశాయి .అయితే తాజాగా ట్విట్టర్ సాక్షిగా ఒక నెటిజన్ “జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ,మీరు (రష్మీ)మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు ..మీ కెరీర్లో ఎంతో శ్రమిస్తున్నారు .
మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆయన సూచించాడు .దీనికి ఘాటుగా రిప్లై ఇస్తూ రష్మీ మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నీకలా తెలుసు .స్క్రీన్ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు .రీల్ లైఫ్ వేరు ..రియల్ లైఫ్ వేరు ..చూసేవారికి ఆనందాన్ని పంచడానికి మేము సరదాగా ఉంటాం .అంతే కను ఎవరిని పెళ్ల్లి చేసుకోవాలో మాకు తెలుసు .మా ఇష్టం ..మీ సలహాలు అక్కర్లేదంటూ ఆమె బదులిచ్చారు .