పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. వివాహ నిశ్చితార్ధం కూడా జరగడంతో కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు అభినందిస్తున్నారు. రేణుదేశాయ్ జీవితం ఎండమావిలా కాకుండా, సంసార జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు తెలిపిన వారిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఉండటం విశేషం.
తాజాగా, ఈ భామ రేణుదేశాయ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేనప్పుడు రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అంటున్నారు చాలా మంది నెటిజన్లు. శ్రీరెడ్డి ఉద్దేశం కూడా అదే. పవన్ కళ్యాణ్‌తో రేణుదేశాయ్ సహజీవనం చేసింది. తరువాత పెళ్లి చేసుకుంది. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు రేణుదేశాయ్‌కు శుభాకాంక్షలు తెలపడం వైరల్ అయింది.