Home / ANDHRAPRADESH / ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు

ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు

ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే ఆయన దీక్ష విరమించారు. ఆ దీక్ష ఫలితమే మనకి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం వచ్చింది ” అని ఆయన అన్నారు .ఈ మాటలపై ఒక నెటిజన్ సెటైర్లు వేస్తూ విరుచుకుపడ్డారు.ఉన్నది ఉన్నట్లు మీకోసం “ఇది మన బాబు గారు చెప్పిన చరిత్ర

అయ్యా బాబు గారు ఎంటి సార్ ఇది ?

ఒక ముఖ్యమంత్రి స్థానం లొ ఉండి మహనీయుల చరిత్రని ఇలా మీరు వక్రీకరిస్తుంటే ఎలా సార్ ? పొట్టి శ్రీరాములు గారు చెసిన ఆత్మబలిదానం మీద ఇలా మాట్లాడట కరెక్టు కాదు సార్. పొట్టి శ్రీ రాములు గారు ప్రత్యెక ఆంద్ర రాష్ట్రం కొసం మద్రాసు లొ 1952 అక్టొబర్ 19 న బులుసు సాంభ మూర్తి గారి ఇంట్లొ నిరాహార దీక్ష ప్రారంభించి చివరికి 1952 డిసెంబర్ 15 న ఆంద్ర రాష్ట్ర ఆశయ సాధన కొసమే నిరాహార దీక్ష చెస్తూనే ప్రాణ త్యాగం చెసారు కాని ఆయన ఎక్కడ మీరు సభ లొ చెప్పినట్టు దీక్ష విరమించలేదు , ఆయన మరణం వరకు కూడా ఆంద్ర రాష్ట్ర మీద స్పష్టమైన ఎలాంటి హామి ఎవ్వరిదగ్గరనుండి రాలేదు. మీరేమొ హామి వచ్చింది అని చెప్పారు ఎవరు ఇచ్చారు హామి ఎక్కడనుండి వచ్చింది సార్ హామి , పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15 న మరణీంచినతరువాత చిత్తురు నుండి విశాఖా పట్నం వరకు ఆంద్ర రాష్ట్ర సాధన కొరకు జరిగిన అల్లరులలొ జరిగిన పొలీసు కాల్పులలొ అనేక మంది చనిపొయారు మీరు అన్నట్టు హామి వస్తే వీరు ఎలా చనిపొయారు సార్ అసలు అల్లరలే జరగలేదు పొలీసు కాల్పులు జరగలేదు అని అంటారా ? ఆ మహనీయుని మరణం తరువాత జరిగిన అల్లరులు ఫలితంగా 1952 డిసెంబర్ 19 న ( ఆయన పరణించిన 4 రొజులకి ) రాజ్యంగం లొ 3వ నిబందనను అనుసరించి ఆంద్ర రాష్ట్రం ఏర్పాటుకు కెంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అని జవహర్లాల్ నెహ్రు గారు ప్రకటించారు – ఇది కద సార్ ఆ మహనీయుని చరిత్ర.

మహనియుల గురించి వారి చరిత్రలు గురించి ప్రజా సభలొ ప్రశంగించెసమయం లొ ఆ మహనీయుల గౌరవం ని వారి పొరాటాం ని దౄష్టి లొ పెట్టుకుని మాట్లాడండి. మన మహనియుల గురించి ఒక ముఖ్యమంత్రి స్థానం లొ ఉండీ తప్పుగా మాట్ళాడితే ఈ రాష్ట్ర ప్రజలు పొరుగు వారి ముందు తలెత్తుకుని ఎలా తిరగగలం చెప్పండి ముఖ్యమంత్రి గారు”అని అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat