Home / SLIDER / జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!

జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!

వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నన్నపునేని నరేందర్..నిన్న బారతీయ జనతా పార్టీ జన చైతన్య యాత్రలో తెలంగాణా ప్రభుత్వం పై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.అది జన చైతన్య యాత్ర కాదు జనంలేని యాత్ర అని ప్రజలకు సేవచేయడానికి కావాల్సింది మగతనం కాదు అని ప్రజలకు సేవచేయాలంటే కావాల్సింది కమిట్ మెంట్ అని ఆయన అన్నారు.ఒక దేశాన్ని పాలిస్తున్న పార్టీ జాతియస్థాయి నాయకులు మాట్లాడే బాష ఇది కాదని సంస్కారం తప్పి మాట్లాడటం సరైంది కాదని ఆయన అన్నారు.

అధికారంలోకి రావాలంటే కావాల్సింది మగతనం కాదని ప్రజాబలం కావాలని,ఆ మాట మీ ఆలోచనా విదానాన్ని తెలియజేస్తుందని మేయర్ తెలిపారు.కేసీఆర్ ను గద్దె దించడం మీవల్ల కాదు కదా జేజమ్మల వల్ల కూడా కాదని మేయర్ అన్నారు.బీజేపీ పార్టీకి క్యాడర్ తక్కువ లీడర్లెక్కువని రాష్ట్రంలో ఆ పార్టీ అదికారం మాట అటుంచితే కనీసం 119మంది అభ్యర్దులనైనా వెతుక్కోవాలని వారికి సూచించారు.

వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రాదాన్యత తగ్గిస్తున్నారని బీజేపీ అద్యక్షుడు లక్ష్మన్ మాట్లాడటం ఆయన అవగాహణా రాహిత్యానికి నిదర్శనమని,నగరానికి ఏటా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 300కోట్ల నిదులు కేటాయిస్తూ నగరం అభివృద్ది పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని,ఎన్నడూ లేని విదంగా నిదులు కేటాయిస్తూ నగరాన్ని అభివృద్ది పథంలో తీసుకెల్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లది ఈ సందర్బంగా మేయర్ అన్నారు.

తెలంగాణా పథకాలను,పాలనను మోడీతో సహా కేంద్ర మంత్రులు మెచ్చుకుంటుంటే ఇక్కడి నాయకులకు అది అర్దంకాక పిచ్చికూతలు కూస్తున్నారని,తెలంగాణా ప్రభుత్వ పథకాలను బీజేపీ కాపీ కొట్టి వారి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తోందని,తాగు సాగునీరు కోసం మిషన్ కాకతీయ,మిషన్ భగీరద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే బీజెపీ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే తలమానికం అని కేంద్ర మంత్రులే ఒప్పుకున్నారని,మిషన్ భగీరద లో అవినీతి జరిగిందటున్నారు..అలా జరిగేదుంటే ప్రదాని ఎందుకు ప్రారంభోత్సవం చేసినట్టు అని ఇలా అర్దం పర్దంలేని ఆరోపణలు చేసి ప్రజలలో చులకన అవ్వద్దని మేయర్ హెచ్చరించారు. బీజేపీకి అదికారం అందని ద్రాక్షేనని,కేసీఆర్ ను గదద్దెదించండం బీజేపీ వల్లకాదని,ఆయన చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాలు ఆయనను గెలిపిస్తాయని,బీజేపీకి 2019లో ప్రజలు బుద్దిచెపుతారని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్ట్ ఇస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఇంత వరకు ఆ ప్రయత్నం చేయని బీజేపీ నాయకులు నేడు కేసీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరమని,ప్రత్యేక హైకోర్ట్ సాదించలేని వారు బీజేపీ నాయకులని,ఏ ప్రభుత్వం చేయని విదంగా నగరంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించిన ఘనత మాదని,ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిదని ఈ సందర్బంగా మేయర్ గుర్తు చేసారు.జన చైతన్య యాత్రకు జనాదరణ లేదని,ఉనికి కోసం బీజేపీ ఆరాటపడుతుందని,ముందు బీజేపీ తమకున్న స్థానాలు నిలుపుకోండని,అర్దం పర్ధం లేకుండా విచక్షణ కోల్పోతూ అసభ్యమైన మాటలు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ది చెబుతారని మేయర్ వారికి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat