సుమంత్ అశ్విన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈ సినిమాలో సుమంత్ సరసన నిహారిక హీరోయిన్ గా నటించింది.ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది . ఈ మూవీని జూలై 28న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం (జూలై-11)న ట్విట్టర్ ద్వారా తెలిపింది. హ్యపి వెడ్డింగ్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా, ఇందులో పాల లాంటిది మా హర్ష.. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లైన్ చేసుకోవచ్చు.. మరి మా మనవడితో కాపురం చేసుకోవచ్చా అండి అనే డైలాగ్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో సాంగ్ కూడా అలరించింది. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Wedding date is locked! Inviting you all to the #HappyWedding of #SumanthAshwin and @IamNiharikaK on 28th July. A film by @UV_Creations and #PocketCinema directed by @lakshmankarya.#HappyWeddingOnJuly28th pic.twitter.com/E9r7a5BoP2
— UV Creations (@UV_Creations) July 11, 2018