Home / SLIDER / ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచారు

ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచారు

సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి అనుబంధంగా పని చేస్తున్న మెడికల్ కాలేజీ ఎంసిహెచ్ విభాగంలో ఒకే రోజు 33 మందికి ప్రసవాలు చేసిన ఆ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. రూ.25 కోట్లతో నిర్మించిన వైద్యశాల సిబ్బంది మంచి ఫలితాలు సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కెసిఆర్ కిట్ల పథకం ప్రారంభించాక రాష్ట్రంలో జరుగుతున్న ప్రసవాల మొత్తంలో సగానికిపైగా సర్కార్ దవాఖానాల్లోనే జరుగుతున్నాయన్నారు. కెసిఆర్ కిట్ల పథకం ప్రభావానికి తోడుగా, ఆయా హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్నారు. అయితే, సిద్దిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్రావు చొరవ, ప్రోత్సాహంతో వైద్యులు, సిబ్బంది అత్యద్భుతంగా పని చేస్తున్నరనడానికి 24 గంటల్లో 33 మంది ప్రసవాలే ఉదాహరణ అన్నారు. సిద్దిపేట హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది రాష్ట్ర వైద్య శాఖకే ఆదర్శంగా నిలిచారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగతా సిబ్బంది, వైద్యులు బాగా పని చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు.

డిఎంఅండ్ హెచ్వోని అభినందించిన మంత్రి

ఆర్మూరు ప్రభుత్వ దవాఖానాలో తన బిడ్డను ప్రసవింప చేయడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం వైద్యాధికారి దయానంద్ సర్కారీ దవాఖానాల మీద ప్రజలకు మరింత నమ్మకం పెంచారని ఆయన్ని అభినందించారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. తన కోడలు నవీన స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కావడంతో, అక్కడే ప్రభుత్వ దవాఖానాలో చేర్పించి ప్రసవింప చేయడం అభినందనీయమన్నారు. తన కొడుక్కి రియంబర్స్ మెంట్ అవకాశం ఉన్నప్పటికీ, వినియోగించుకోకుండా, సర్కార్ దవాఖానాల మీద నమ్మకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సర్కార్ దవాఖానాల్లో అనేక అత్యాధునిక సదుపాయాలు కల్పించామని, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఎంఐసియూలు, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో లక్షలు వెచ్చించినా అందని వైద్యం ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా అందుతున్నదని మంత్రి తెలిపారు. గతంలోనూ భూపాలపల్లి కలెక్టర్ ఇలాగే చేసి ప్రభుత్వ దవాఖానాల ఔన్నత్యాన్ని పెంచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రత్యేకించి వైద్యశాఖ వాళ్ళకు తన చర్య ద్వారా ఆదర్శంగా నిలిచావంటూ, భద్రాద్రి కొత్తగూడెం వైద్యాధికారి దయానంద్ ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

మరికల్ వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు

మహబూబ్నగర్ జిల్లాలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపికైన మరికల్ వైద్య సిబ్బంది, డాక్టర్లను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందించారు. ప్రతి నెలా 30 వరకు ప్రసూతిలు చేస్తూ, పరిశుభ్రత, రోగులకు ఉత్తమ సేవలు అందించడంలో ముందున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మరికల్ దవాఖానాను ఆదర్శంగా తీసుకుని మిగతా దవాఖానాలు కూడా మంచి వైద్యం పేదలకు అందించాలని సూచించారు.

మిడ్జిల్ వైద్యులకు అభినందనలు

మరోవైపు మిడ్జిల్ దవాఖానా పనితీరుకి నాలుగు అవార్డులు గెలుచుకోవడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆ వైద్యశాల సిబ్బంది, వైద్యులను అభినందించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వారు ఈ అవార్డులు గెచుకోవడం అభినందనీయమని అన్నారు. సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat