Home / NATIONAL / రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్

రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్

పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యాల్సిన రైతు రుణమాఫీ మొత్తం సుమారు రూ 30 వేల కోట్ల పైనే ఉంది .

ఈ లెక్కన ఆ ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చెయ్యాలంటే మరో 7 – 8 ఏళ్ళు పడుతుంది . అక్కడ ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తామని మాట నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను కూడా తప్పుడు ప్రకటనలిస్తూ రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామని మోసం చేస్తున్నది . తెలంగాణ లో రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలంటే కనీసం నాలుగైదు నెలలు ఉద్యోగుల జీతాలు , పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు మొత్తం నిలిపివేయాలని ఆర్ధిక శాఖ అధికార వర్గాలు తమను ఆరా తీసిన మీడియాతో చెబుతున్నయి .

గత 60 ఏళ్ళు ప్రజలను సమైక్య పాలనలో మోసం చేసినట్లుగానే ఇప్పుడు కూడా మోసం చెయ్యవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు కనపడుతున్నది . కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదని నాలుగు విడతలుగా రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చెబుతున్నది .

ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రూ 36359 కోట్లకు రూ 7371 కోట్లు మాత్రమే మొదటి విడతలో మాఫీ చేయనున్నట్లు చెబుతున్నది . చివరికి తెలంగాణ లో ఒకటి రెండు సీట్లు కూడా గెలుస్తారో లేదో అనుమానం ఉన్న బీజేపీ కూడా రెండు లక్షల రుణమాఫీ అని డాంబికాలు పలుకుతున్నది . తమ పార్టీ తెలంగాణాలో ఈ సారి ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉండబట్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి వాగ్దానాలు చేస్తున్నడని ఆయన అంటే పడని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నరు . ఎలాగూ కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రభంజనంలో భారీ ఓటమి ఖాయం కాబట్టి ఉత్తమ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడని ఉత్తమ్ వ్యతిరేక వర్గం చెవుతున్నది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat