Home / SLIDER / నేతన్నకు అండ యువతకు స్పూర్తి…

నేతన్నకు అండ యువతకు స్పూర్తి…

మూలకు పడిన మర మగ్గం మురిసిన నవ్వుతున్న సందర్బం.బతుకు చిత్రంలో చితికి పోతున్న నేతన్న చిరునవ్వు చిందించిన సందర్బం.కన్నీటి చెరసాలను వీడి కల్లోలమవుతున్న బతుకులను వీడి కలలన్నీ నిజమవుతున్న అపూర్వ సందర్బం.కాటికి పోతే ఎక్స్గేషియాలను ప్రకటించిన నేలన బతికుండగానే భరోసా ఇచ్చిన సందర్బం.బతుకుపై ఆశ మెతుకుపై భరోసా కల్పించిన నేత.సిరిసిల్ల ను బంగారు వల్లిగా మార్చిన విదాత,నేతన్న బతుకుల్లో నూతల వెలుగులు నింపిన ప్రధాత ముఖ్యమంత్రి గారు తెలంగాణాకు అందించిన ఆణిముత్యం కల్వకుంట్ల తారక రాముడు.

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం వదిలిపెట్టుకుని తన తండ్రి తెలంగాణా ఆకాంక్షకోసం పడుతున్న తపనను చూసి,ప్రజాసేవకోసం తన తండ్రి చేస్తున్న కృషిని చూసి తాను కూడా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా పోరాటంలో దిగి,ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తాను ముఖ్య పాత్ర పోషించి దర్జా బ్రతుకును వీడి తెలంగాణాకు పట్టిన దరిద్రాన్ని వదల్చడానికి కదనరంగంలో దిగి కష్టసుఖాలకోర్చి కన్నీటిగాదలు తీర్చిన నాయకుడు మంత్రి కేటీఆర్..మాట సూటిగా ఉంటది.ముళ్ళబాటను పూలబాటగా మార్చాడు.సవాళ్ళను అదిరోహించి సంతోషం వైపు నడిపించాడు.తండ్రిలోని చాణిక్యం,ఆలోచనా,వ్యూహం,ఆచరణ కలిగిన నాయకుడు.యువత కు స్పూర్తి కల్వకుంట్ల తారకరామారావు.

ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణా ఏర్పాటు అనంతరం ప్రభుత్వంలో ఐటీ మరియూపురపాలక జౌళి శాఖామంత్రిగా బాద్యతలు తీసుకుని తనకు అప్పజెప్పిన బాద్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు.అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన చరిత్ర తెలంగాణా నేతన్నలది.కానీ గత ప్రభుత్వాల నిర్వాకం,పట్టింపుకు నోచుకోని చేనేత రంగం ,అప్పులతో కూరుకుపోయిన కార్మికులు,వృత్తి లేక,ఉపాది దొరక్క అదే చీరతో ఉరేసుకున్న సందర్బాలు అనేకం.కానీ తెలంగాణా ఏర్పాటు అనంతరం ఈ పరిస్థితి పూర్తిగా మారింది.తాను ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం చేనేత రంగాన్నే నమ్మకున్న ఒక క్షేత్రం. వారికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి,వారి సమస్య ఎలా తీర్చగలమో అద్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలను అమల్లో పెట్టి నేతన్నకు అండగా నిలిచి,వాళ్ళలో మనోదైర్యాన్ని నింపారు కేటీఆర్.

చేనేత రంగంలో మునుపెన్నడూ లేని పెనుమార్పును తీసుకొచ్చారు.చేనేతలకు లక్షలోపు రుణాలు మాపీ చేస్తూ వారిని అప్పుల ఊభినుండి భయటపడేసారు.చేనేతలు వాడే ముడి సరుకులపై సబ్సిడీ కల్పిస్తూ 10.50కోట్ల నిదులు విడుదల చేసి సిరిసిల్ల జిల్లాలో 1500మంది కార్మికులకు లబ్ది చేకూర్చి వాళ్ళకు అండగా నిలిచారు.రాష్ట్రంలో 380వరకు చేనేత సహాకార సంఘాలు ఉండగా 80వేల మంది కార్మికులకు లక్షలోపు రుణాలన్నీ మాపీ చేసారు.హాడ్లూమ్ మరియూ టెక్స్ టైల్ కు వేరు వేరుగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వారి మంచి చెడ్డా చూసేందుకు వీలు కలిపించారు.ఏడాదిలో వారికి దాదాపు ప్రతీరోజు పని ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలను అమలు చేసాడు మంత్రి కేటీఆర్.

 

కేటీఆర్ మంత్రిగా అయిన తర్వాత ప్రతీ సోమవారం హాడ్లూమ్ డే గా ప్రకటించి వివిద ప్రభుత్వ శాఖల్లో అది అమలయ్యేలా వారిని చైతన్యపరిచారు.ప్రభుత్వ శాఖలకు కావాల్సిన వస్త్రాలను చేనేత జౌళిశాఖ ద్వారానే కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసి వారికి అండగా నిలిచారు బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరెలను,ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్దుల యూనీఫాం క్లాత్,వివిద శాఖల్లోని ఉద్యోగులకు యూనిఫాం వస్త్రం,వైద్యారోగ్యశాఖల్లో దవాఖానాల్లో వాడే మెటీరియల్ ను నేతన్న నుండే తీసుకునే విదంగా పలు సమీక్షలు నిర్వహించి,వారికి అవగాహన తెప్పించి అది అమలు చేసి నేతన్నకు ఉపాది అవకాశాన్ని కల్పించారు కల్వకుంట్ల తారక రామారావు.

చేనేత రంగంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.ఆయన ఉద్యమ సమయంలో సుదీర్గంగా వారి సమస్యలపై గడపగడపకు తిరిగి అద్యయనం చేసారు.వారి కష్టాలను పలు సందర్బాల్లో వారు ప్రస్తావించారు.కేటీఆర్ గారు ఆ శాఖకు మంత్రి అయిన అనంతరం పూర్తి అద్యయనం చేసి 18ఏండ్లు నిండిన చేనేత కార్మికులకోసం ”నేతన్నకు చేయూత”పేరుతో 75కోట్ల నిదులు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషిచేసారు.బతుకమ్మ కోసం తయారు చేసే చీరలద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 20000మంది నేత కార్మికులకు ఉపాది కల్పించారు.

నేతన్నను మరిచిన గత ప్రభుత్వాల నిర్వాకం ,వారిని పట్టించుకోక ,వారికి భరోసా కల్పించలేక అదైర్యంతో నేతన్న ఉరికొయ్యకు వేలాడిండు.గత పాలకుల తప్పిదాలు పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో జరగకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పాన్ని విజయవంతంగా ఆచరణలో పెట్టి వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపారు మంత్రి కేటీఆర్.

యువతలో స్పూర్తి నింపుతూ వారి బంగారు భవిష్యత్ కోసం ,ఐటీ రంగంలో పెనుమార్పును తీసుకొచ్చారు.ఐటీ రంగంలో స్వియ అనుభవం కలిగిన వ్యక్తి కేటీఆర్. ఆయన ఆ శాఖను చేపట్టిన తర్వాత దేశంలోనే తెలంగాణా ఐటీరంగం విజయవంతంగా దూసుకెల్లింది.ఉమ్మడి రాష్ట్రంలో 55,000కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు నేడు స్వరాష్ట్రంలో రికార్డు స్థాయిలో రెట్టింపై 93,442కోట్లకు చేరాయి.జాతీయ సగటు కంటే 5.3%ఎక్కువ అంటే ఇందులో మంత్రి కేటీఆర్ పనితనం ఏంటో అర్దం చేసుకోవచ్చు.తాను పగ్గాలు చేపట్టిన తర్వాత ఐటీరంగంలో తెలంగాణా జైత్రయాత్ర మొదలైందని చెప్పవచ్చు.ప్రతీ ఏటా ఊహించిన దానికంటే ఎక్కువ ఐటీ ఎగుమతులు సాగుతున్న తీరు కేటీఆర్ గారి పనితనానికి నిదర్శనం.ఈ రంగంలో తెలంగాణా వృద్దిరేటు బారతదేశ వృద్దిరేటుకు కన్నా ఎక్కువ ఉంది.2014-15లో 66276కోట్లు,2015-16లో 75,070కోట్లు,2016-17లో 85470కోట్లు ,2017నుండి ఇప్పటివరకు 93442కోట్లతో దినదినం తెలంగాణా ఐటీ రంగం పురోగమిస్తుంది.పదవి ఒక్కటే సరిపోదు.పనిలో శ్రద్ద,ఆలోచన అవసరం.ఐటీ రంగంలో దేశంకంటే తెలంగాణా ముందుందంటే మంత్రి కేటీఆర్ దానిపై ఎంత శ్రద్ద పెడుతున్నారో చెప్పవచ్చు.

తెలంగాణా యువతకోసం మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అద్బుతం.అందుకే ఆయన యువతకు ఒక ఐకాన్ గా మారాడు.సినిమా హీరోలకు లేని ఫాలోయింగ్ యువతలో కేటీఆర్ గారికి ఉందంటే అతిశయోక్తి కాదు.యువత నైపుణ్యం పెంచడం కోసం ,వారి బంగారు భవిష్యత్ కోసం మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు.ఆయన చేతుల మీదుగా రూపొందిన సంస్థ”తెలంగాణా అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(Task).దాదాపు రెండులక్షలమంది యువతకు నైపుణ్యాబివృద్ది శిక్షణా కార్యక్రమాలను టాస్స్ నిర్వహించింది.దీంతో యువతలో నైపుణ్యం పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్దులకు సైతం పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగం వచ్చేలా చేసింది.

తెలంగాణాను ఐటీ హబ్ గా మార్చాలనే ఉద్ద్యేశ్యంతో మంత్రి కేటీఆర్ గారి ఆలోచననుండి పుట్టికొచ్చిన బృహత్తర యజ్ఞం ”టీహబ్” ..టీ హబ్ ఖ్యాతి ఇప్పటికే ఖండాంతరాలు దాటింది.టీహబ్ బాగుందని పెద్ద పెద్ద దేశాలే మంత్రి కేటీఆర్ గారిపై ప్రశంసల వర్షం కురిపించింది
అగ్రరాజ్యమైన అమెరికాలోని కాలిఫోర్నియా,మిస్సోరీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటే దాని గొప్పదనం చెప్పకనే చెప్పవచ్చు.తొలి విడతలో 200పరిశ్రమలు ఉంటే ఇప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ గా టీహబ్ రెండో ఫేజ్ ను మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో రూపుదిద్దుకుంటుంది.ఆలోచనపరమైన యువత తమ ఆలోచనలను అమలులో పెట్టడానికి ఇబ్బందులు పడుతున్న సందర్బంలో మంత్రి కేటీఆర్ గారు చొరవ తీసుకుని తన నైపుణ్యాన్నంతా కూడగట్టి యువతలో నైపుణ్యాన్ని భయటకు తీసే మార్గాలకు వెతికి వాటిని వారికి అందుబాటులోకి తెచ్చి యువతకు మార్గనిర్దేశం చేసిన తీరు అద్బుతం.అందుకే యువత కేటీఆర్ అంటే ఇష్టపడతారు.ఆయనకు యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ,స్మార్ట్ ఐటీ మినిస్టర్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్ అంటూ యువత కేటీఆర్ గారిని కనపడినప్పుడల్లా సంబోదిస్తుంటారు.
అగ్రరాజ్యమైన అమెరికా అద్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ హైదరబాద్ వచ్చినప్పుడు కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని చూసి ఆమె మంత్రముగ్దులయ్యారు.ఆయనను అమెరికా ఒక సమావేశంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానించారు.పలు దేశాలు కేటీఆర్ గారిని తమ వద్ద పలు సమావేశాలలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానించిన సందర్బాలు కోకోళ్లలు.ఇప్పటికే పలుదేశాల వేదికలపై మంత్రి కేటీఆర్ ఐటీ రంగంపై అనేక ప్రసంగాలు చేసారు. కేటీఆర్ గారిపై యువతలో ఉన్న అభిమానాన్ని చూసి సినీ హీరోలో సైతం కుల్లుకుంటున్నారని గుస గుస.

తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లాగే కేటీఆర్ కూడా మంచి మాటకారి ప్రత్యర్దుల ఎత్తులు చిత్తు చేయడంలో దిట్ట,ప్రత్యర్దులపై చలోక్తులు విసిరినా,వారిపై కథల రూపంలో బాణాలు సందించినా,కేసీఆర్ గారిలాగే సామేతలు చెప్పి ప్రజలను ఆలోచింజేసినా కేటీఆర్ చాకచక్యం అక్కడ కనపడుతుంది.ప్రజల్లోకి ప్రతిపక్ష కుట్రలను తీసుకెల్తూ దూకుడుగా వ్యవహరించడం,అదే సమయలో యువతలో నైపుణ్యం పై ఆలోచింపజేసే ఉపన్యాసాలు ఇస్తూ యువతలో స్పూరినింపుతారు.కేటీఆర్ గారు వస్తున్నారంటే యువత ఆ సమావేశాలకు హాజరవ్వాలనే ఉత్సుకత కనబరుస్తారంటే అతిశయోక్తికాదు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో మంత్రి కేటీఆర్ గారు బాద్యతలు తీసుకుని రికార్డు స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారు.తన మాట సూటిగా ఉంటుంది.ప్రత్యర్దుల గుండెల్లో అదొక రామబాణం,అది అందుకే ఎప్పుడు గురితప్పలేదు.

హంగులూ ఆర్బాటాలకు ఆయన పూర్తి వ్యతిరేకం,తన జన్మధినాలకు కేక్ లు కట్ చేయద్దంటూ,ప్లెక్సీలు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని దెబ్బతీయద్దంటూ ,బొకేలను తీసుకురావద్దంటూ ఆయన తన అభిమానులకు,ప్రజలకు ఇచ్చిన సందేశం ఆయన హుందాతనాన్ని తెలియజేస్తుంది.గ్రేటర్ నగరాల్లో,మున్సిపాలీటీల్లో ప్లెక్సీల నిషేదాన్ని అమలు చేస్తూ,అవి కడితే ఫైన్ విదిస్తూ నిర్ణయం తీసుకుని దాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్.మున్సిపల్ రంగంలో ఆదునాతన టెక్నాలజీలను అమలు చేస్తూ అభివృద్ది పదంలో నడిపిస్తున్నారు.

చేనేత రంగానికి బాసటగా నిలుస్తూ,వారి జీవితాలలో నూతన ఆశలను చిగురింపజేస్తూ వారి బ్రతుకుల్లో వెలుగునింపుతున్నారు కేటీఆర్.మూలకు పడిన మగ్గం మురిసి నవ్వేలా,సాంచెల సవ్వడితో సగర్వంగా వారు నిలబడేలా చేసి వారి భవిష్యత్ కు భరోసాగా నిలిచారు.

ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలోనే కాకుండా సామాజిక మాద్యమాల ద్వారా చురుగ్గా స్పందిస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు.
యువతలో్ నైపుణ్యాన్ని పెంపొందిస్తూ,ఐటీ రంగం అబివృద్దితో పాటు ,పెనుమార్పులను తీసుకొచ్చి పెట్టుబడులకు స్వర్గదామంగా మార్చి యువతకు ఉపాది కల్పిస్తూ వారి జీవితాలు బంగారు మయం చేస్తున్నారు.తన తండ్రి కేసీఆర్ గారి ఆశయాలను అమలు చేస్తూ,తండ్రి కి తగ్గ తనయుడుగా ,చేనేతకు అండగా,యువతకు స్పూర్తిగా నిలుస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు తెలంగాణాకు దొరికిన ఆణిముత్యమే…

 

-Telangana Vijay
Narsampet