Home / 18+ / ప‌వ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన అభిమాని..!

ప‌వ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన అభిమాని..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చేతు అనుభ‌వం ఎదురైంది. కాగా, ఇటీవ‌ల జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జ‌న‌సేన పార్టీ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ స‌భ‌కు హాజ‌రైన ఓ డాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వెర్రి న‌వ్వులు న‌వ్వ‌డం, దిక్కులు చూడ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతైంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇటీవ‌ల భీమ‌వ‌రం ప‌ట్ట‌ణంలో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి భీమ‌వ‌రంలోని ప‌వ‌న్ అభిమానులు హాజ‌ర‌య్యారు. సోమ‌రాజు అనే ఎముకల డాక్ట‌ర్ కూడా హాజ‌ర‌య్యాడు. ఆయ‌న మాట్లాడేందుకు అలా మైక్ అందుకున్నాడో.. లేదో.. వెంట‌నే కిటికీలు మూసేయండి, రికార్డింగ్ ఆపేసేయండి అని చెబుతూనే మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడు.

మా ప్ర‌ధాన స‌మ‌స్య అధినాయ‌క‌త్వం. అధినాయ‌కుడు ఎప్పుడైతే త‌ప్పు చేశాడో.. సొసైటీలో అది అంగీకారం అయిపోతుందని, మా అధినాయ‌కుడే త‌ప్పు చేశాడు.. మేమెంత అని.. చోటామోటా నాయ‌కులు సైతం త‌ప్పులు చేస్తున్నార‌న్నారు. మీరు త‌ప్పు చేయ‌లేద‌ని ఒక్క మాట చెప్పండి.. ఇప్పుడే మా ఓట్ల‌న్నీ మీకు వేసేసి వెళ్లిపోతాం. ఇందులో ఏంటి గొడ‌వ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లుప‌ట్టించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat