Home / ANDHRAPRADESH / బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?

బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేఎస్ జవహర్ టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కొత్త‌ప‌ల్లి శామ్యూల్ జ‌వ‌హ‌ర్‌ త‌న‌దైన రాజ‌కీయాలు పోషిస్తూ సీఎం చంద్రబాబుకు న‌మ్మిన బంటుగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటినుంచీ పార్టీ కార్యక్రమాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో జ‌వ‌హ‌ర్ ముందున్నారు. మ‌రో ఏడాదిలోపే ఎన్నికలు ఉండడంతో ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఉన్న జవహర్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు పక్కన పెట్టి నియోకవర్గంలో ఓట్ల వేట మొదలు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల నియోజ‌క‌వ‌ర్గంలో అసంతృప్తులు ఎక్కువయ్యారని తెలుస్తోంది. పార్టీకోసం తన గెలుపుకోసం పనిచేసినవారిని జవహర్ పక్కన పెట్టారని దీంతో వారంతా మరోవర్గంగా ఏర్పడ్డారని తెలుస్తోంది. అయితే సదరు మంత్రిగారు కులంకార్డుతో రాజకీయం చేస్తున్నా తన కులంవారికి ఏమీ చేయలేదనే తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దళిత కవాతు లో తప్ప దళితులకు ఏమాత్రం ఉపయోగపడలేదట జవహర్.. క‌లుపుగోలు మ‌నిషి, అలుపెరుగ‌ని అడుగు, కిందిస్థాయి నుంచి వచ్చాడన్న సానుభూతి మాత్రం జవహర్ పై ఉంది. పుష్కరాల సమయంలో చేసిన అభివృద్ధి తప్ప జవహర్ నియోజకవర్గంలో పెద్దగా చేసిందేమీ లేదనే స్థానికులు చెప్తున్నారు. కాగా పుష్కరాల సమయంలో వేసిన రోడ్లు యాత్రికులకు ఉపయోగపడ్డాయి తప్ప ఇప్పుడు ప్రజలు ఎందుకూ పనికిరావడం లేదట.. కొవ్వూరుల ఆర్ అండ్ బీ రోడ్లు పడాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయట.. గవర్నమెంట్ హాస్పిటల్, డిగ్రీకళాశాల వంటి హామిలిచ్చినా అవి నెరవేరకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాలవారీగా మొత్తం లక్ష 64వేలమంది ఓటర్లుండగా పసుపు చొక్కాలు వేసుకున్నవారికి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయట. కొవ్వూరులో నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని హామీ ఇచ్చి బెల్టుషాపులు భారీగా తెరిచారనే విమర్శలున్నాయి. చాలాచోట్ల కనీసం వీధిలైట్లు కూడా లేవట.. పక్కనే గోదావరి ఉన్నా త్రాగునీటికోసం ఇంటింటికీ కుళాయిలు వేయించలేకపోతున్నారని తెలుస్తోంది. ఈప్రాంతంలోని ఓరంగాబాద్, వాడపల్లిలో మంత్రి అండదండలతో భారీగా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయట. మంత్రి అనుచరులు సెటిల్మెంట్లు, ఇసుక ర్యాంపుల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారట. ఈయనకు షాడోలుకూడా ఎక్కువైపోయారని తెలుస్తోంది. స్థానికులతో ఆర్టీసీ డిపో పునరుద్దరించామని పదేపదే చెప్పుకోవడం తప్ప మరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదట. అలాగే ఇటీవల హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్న మంత్రి జవహర్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసిన పురాతన శివలింగంతో పాటు వినాయకుడు, నందీశ్వరుడు, రావణబ్రహ్మ విగ్రహాలను పోలీసుల, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు మంగళవారం దౌర్జన్యంగా తొలగించారు. స్థానికులు అడ్డగించినా విగ్రహాలను తొలగించారు. హెల్త్‌ డ్రింక్‌ తాగి మంత్రి తీసుకున్న నిర్ణయాలకు కొమ్ముకాస్తున్న పోలీసు వ్యవస్థ నశించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. వాడపల్లి రోడ్డులోని ఏరినమ్మ ఘాట్‌ వద్ద ఉన్న తొమ్మిదిన్నర ఎకరాలు భూమిని పర్యాటకం పేరుతో కొంతమందికి కట్టబెట్టారట.

ఇక తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్‌గా ఉన్నా గ్రూపురాజకీయాలు చాలా మైనస్‌గా మారాయి.. జవహర్ ఒకరిద్దరికి మాత్రమే ప్రయారిటీ ఇస్తుండడంతో నియోజకవర్గంలో బలమైన నాయకులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు కొవ్వూరులో భారీగా విజయవంతమైంది. కొవ్వూరు టోల్ గేట్ వద్దనుంచి రోడ్డు కం రైలు వంతెన మీదుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కొవ్వూరు గోదావరి గట్టుపై జన సందోహం ఏర్పడింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పాదయాత్రలో పాల్గొనేందుకు కొవ్వూరు చేరుకున్నారు. ఇక వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు రాజకీయంగా మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారు. వైసీపీ అభ్యర్ధి తానేటి వనితపార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. గతంలో వనితకు పార్టీలోని కీలక నాయకుల సహకారం ఉండేది కాదని, టీడీపీ మైనస్‌ల మీద ఆశలు పెట్టుకోవడం మాత్రమే ఉండేది కానీ జగన్ పాదయాత్ర పార్టీకి బాగా బూస్టప్ గా పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణంగా కనిపిస్తోంది దీనిని వైసీపీ వినియోగించుకుని, వైసీపీ అధిష్టానం ఇంకాస్త దృష్టి పెడితే జవహర్ కు భారీ ఓటమి తప్పేలా కనిపంచట్లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat