Home / 18+ / ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

పైర‌సీతో చ‌చ్చిపోతున్న ఇండ‌స్ట్రీని లీక్స్ కూడా భ‌య‌పెడుతున్నాయి. క‌నీసం, పైర‌సీ అయినా న‌యం.. విడుద‌ల త‌రువాత వ‌స్తుంది. కానీ, లీక్స్ మాత్రం విడుద‌ల‌కు ముందే ర‌చ్చ చేస్తున్నాయి. ఇదే నిర్మాత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ చిత్రంపై ప‌గప‌ట్టిన‌ట్టు ప‌నిక‌ట్టుకుని మ‌రీ లీక్ చేస్తున్నారు. తాజాగా, టీజ‌ర్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్స్ నెట్‌లో క‌నిపిస్తున్నాయి.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో అర‌వింద స‌మేత తెర‌కెక్కుతోంది. ఇప్పుడు నిజంగా, ఈ సినిమాపై బ‌య‌టి వ్య‌క్తులు ఎవ‌రో ప‌గ‌పెంచుకుని మ‌రీ ప‌నిచేస్తున్నారు. మొన్న‌టి మొన్న ఎన్టీఆర్‌, నాగ‌బాబుల‌పై తెర‌కెక్కిన దృశ్యాలు కొన్ని లీక్ అయ్యాయి. ఆ త‌రువాత గుడి ద‌గ్గ‌రే ఎన్టీఆర్ న‌డిచొస్తున్న ఫోటో ఒక‌టి లీక్ అయింది. ఇక, ఇప్పుడేమో టీజ‌ర్‌లోని షాట్స్ కొన్ని క‌నిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ ఎంత జాగ్ర‌త్త తీసుకున్నా కూడా ఇంటి దొంగ‌లే ఈ ప‌ని చేస్తుండ‌టంతో ఏం చేయాలో తెలియ‌కుండా ఉన్నారు.

అయితే, ఆగ‌స్టు 15న అర‌వింద స‌మేత చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కానీ, దానికి ముందే టీజ‌ర్ ఎడిటింగ్ టేబుల్ నుంచి లీక్ అవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యంపై చిత్ర నిట్ కూడా చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. సెట్‌లోకి ఫోన్‌లు బ్యాన్ చేసిన త‌రువాత కూడా ఇటువంటివి జ‌ర‌గ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డాడు త్రివిక్ర‌మ్‌. మ‌రి ఈ విష‌యాల‌పై త్రివిక్ర‌మ్ ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడో చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat