ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను చెప్పుకున్నాడు .
ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ తో కల్సి బరిలోకి ముఖ్యమంత్రి అయ్యారు . ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా నవ్యంధ్ర లో బీజేపీ పార్టీతో పొత్తుపెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యారు . అయితే విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైంది అని ఆరోపిస్తూ ఇటీవలే ఆ పార్టీతో తెగదెంఫులు చేసుకున్నాడు బాబు .
తాజాగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కల్సి బరిలోకి దిగాలని రంగం సిద్ధం చేసుకున్నారు . అయితే ఇదే రాహుల్ గురించి నారా చంద్రబాబు నాయుడు ఏమన్నాడో మీరే చదవండి అంటూ ఈ పేపర్ క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . మీరు ఒక లుక్ వేయండి మరి ..