Home / NATIONAL / ఆగ‌మాగం ప్ర‌వ‌ర్త‌న‌తో.. న‌వ్వుల పాలు అవుతున్న రాహుల్‌..!!

ఆగ‌మాగం ప్ర‌వ‌ర్త‌న‌తో.. న‌వ్వుల పాలు అవుతున్న రాహుల్‌..!!

కాంగ్రెస్ పార్టీ త‌మ నాయ‌కుడిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ తీరును చూసి పార్ల‌మెంటు వేదిక‌గా ఎంపీలు న‌వ్వుకుంటున్నార‌ని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అటు పిల్లోడు కాదు అటు పెద్దోడు కాదని ఎద్దేవా చేశారు. జుక్కల్‌లో రూ. కోటితో నిర్మించిన “జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుల నివాసము మరియు కార్యాలయాని”కి జహీరాబాద్ MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో క‌లిసి ప్రారంభోత్స‌వం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ ప్రవర్తన ఆగమాగంగా ఉందని, పార్లమెంట్ లో ఆయన ప్రవర్తన చూసి నవ్వుకున్నారని పేర్కొన్నారు. దేశమంతా రాష్ట్ర ముఖ్యమంత్రిని మెచ్చుకుంటుంటే రాహుల్ కు కళ్ళు కనబడటం లేదని మంత్రి పోచారం మండిడ‌ప్డారు.

కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ అనేది మోచేతికి బెల్లం పెట్టడమేన‌ని మంత్రి పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. “గతంలోని ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం పై సవితి తల్లి ప్రేమ చూపించారు. కానీ, నేడు నాలుగేళ్ళలోని మన అభివృద్ధి చూసి దేశమంతా మనవైపు చూస్తుంది. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. ఇది మన తెలంగాణ ప్రజలకు గర్వకారణం. కానీ కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఇవేమీ క‌నిపించ‌వు“ అని అన్నారు.

ప్రధాని ఏమి ఉచితంగా మెచ్చుకోలేదని, అందుకు త‌గిన పలితాలు ఉన్నాయని మంత్రి పోచారం అన్నారు. “మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి దైర్యం, పట్టుదల ఎక్కువ.  ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. దేశంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. భవిష్యత్తు లో తెలంగాణ లో కరంటు కష్టాలను తీర్చడానికి రూ. 93,000 కోట్లతో విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తున్నారు. రూ. 83,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించి, నాగమడుగు ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తాం.దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విదంగా ప్రతి నియోజకవర్గంలో MLA క్యాంప్ కార్యాలయంను నిర్మించడం తెలంగాణ లోనే ప్రథ‌మం.  దేశంలో రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ. 8000 ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ.  రైతుకు రూ. 5 లక్షల బీమాను అమలు చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. రేపటి నుండి కంటివెలుగు కార్యక్రమం ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని ప్రజలకు దృష్టి లోపం లేకుండా చేయడానికి కంటివెలుగు కార్యక్రమం“ అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat