Home / ANDHRAPRADESH / నారా లోకేశ్‌ మరో లేటెస్ట్ కామెడీ..!

నారా లోకేశ్‌ మరో లేటెస్ట్ కామెడీ..!

వచ్చే ఏడాది(2019) కల్లా ఏపీ రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్‌ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
దేశం మొత్తమ్మీద గతేడాది వచ్చిన ఐటీ ఉద్యోగాలు లక్షన్నర

  • ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఐటీ ఉద్యోగులు 20 వేల మంది
  • ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా?
  • భారత్‌లో మొత్తమ్మీద 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017లో NASSCOM (The National Association of Software and Services Companies) లెక్కల ప్రకారం ఐటీ ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగుల సంఖ్య లక్షన్నర

 .   *  ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 20 వేలు.

  • రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌(ఏపీఐటీ) ప్రకారమే ఐటీ హబ్‌ అయిన విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 16,988.
    ఇక విజయవాడ, తిరుపతి, కాకినాడల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులతో కలుపుకుని చూస్తే మొత్తంగా 20 వేల లోపే ఉంటుంది.

ఐటీ బూమ్‌ వచ్చిన రెండు దశాబ్దాల నుంచి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 20 వేల కంటే మించలేదు.
మరో ఏడాదికల్లా 2 లక్షల ఉద్యోగాలు రావడం సాధ్యమేనా? అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే 4 సంవత్సారాలు ఒక్క ఉద్యొగం ఇవ్వలేదు..ఎన్నికల 6 నెలలు ముందు  రెండు లక్షల ఐటీ జాబ్స్ అంటు ఉంటే నారా లోకేష్ మరో కామెడీ చేస్తున్నారంటు వారు మండిపడుతున్నారు. ఏపీలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే విరివిగా ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ హామీ ఇస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఏపీలోని ఐటీ కంపెనీలకు ప్రభుత్వ నిరాదరణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat