Home / ANDHRAPRADESH / విదేశీ పర్యటనల పేరుతో ప్రజాసొమ్ము దుర్వినియోగం.. దోపిడీ.. యనమల అరాచకం

విదేశీ పర్యటనల పేరుతో ప్రజాసొమ్ము దుర్వినియోగం.. దోపిడీ.. యనమల అరాచకం

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి సీఎం చంద్రబాబు ఆయన క్యాబినేట్ లోని మంత్రులు పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అయితే విదేశీ వ్యవహారాలను అధ్యయనం చేయడానికి, అక్కడి ప్రతినిధులతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు అంటూ ప్రజల్ని నమ్మించారు. అయితే విదేశీ పర్యటనల పేరుతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసారనే వార్తలు వినిపించాయి. అయితే మంత్రి యనమల రామకృష్ణుడు విదేశాలకు వెళ్లినపుడు పంటికి రూట్ కెనాల్ చేయించారట.. అయితే రూట్ కెనాల్ కు ఎంత ఖర్చవుతుంది మహా అయితే రూ.10వేలు.. ఇంకా మంచి హాస్పిటల్ అయితే 20నుంచి 25వేలు అవ్వొచ్చు.. కానీ ఈ మంత్రి గారి రూట్ కెనాల్ కు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా.. అక్షరాలా 2 లక్షల 88వేల రూపాయలు. అదికూడా ప్రభుత్వ సొమ్ము. ఇదంతా ఏప్రిల్ లో జరిగింది. అయితే తాజాగా ఈ ఖర్చును ప్రభుత్వం చెల్లించినట్టుగా ప్రభుత్వానికి సమర్పించిన ఓ ధృవీకరణ పత్రాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. రాష్ట్రానికి ఏవో పెట్టుబడులు తెచ్చేస్తామని సింగపూర్, మలేషియా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలకు మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి వెళ్లేది వారి పనులు చేసుకోవడానికి, అలాగే నల్లధనాన్ని దాచుకోవడానికేనంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. వీళ్లు చేసిన పనులకు జనం నెత్తిన అప్పుల భారం పడుతోందని ఆగ్రహిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat