ఆసియా గేమ్స్ లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మనో ళ్లు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు.ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా.. అప్పట్లో రన్నరప్‌తోనే సరిపెట్టుకొంది. ఆ తర్వాత ఇప్పుడే భారత్ ఫైనల్ కి చేరింది.అయితే మరో సెమీ్‌సలో జపాన్ 2-0తో ఐదుసార్లు విజేతగా నిలిచినా దక్షిణ కొరియాపై గెలిచింది.ఇప్పుడు భారత్ జపాన్ తో ఫైనల్లో తలబడనుండి.