Home / SPORTS / బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట..ఒకే ఓవర్‌లో

బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట..ఒకే ఓవర్‌లో

 వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో మరోసారి విధ్వంసకర ఆట తీరుతో అలరించాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్న బ్రేవో.. శనివారం సెయింట్‌ కిట్స్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ అప్పటికే అభిమానులను కొన్ని ఉత్తేజకరమైన పోటీలతో అద్భుతమైన అభిమానులను అందించింది. పోలార్డ్ యొక్క వీరోచితం తరువాత, డ్వేన్ బ్రావో అభిమానుల‌ను తన వైపు తిప్పుకున్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఒకే ఓవ‌ర్లో ఐదు సిక్సర్లు. 19 ఓవర్‌లో బ్యాటింగ్ లో ఉన్న బ్రేవో.. బౌల‌ర్ జోసెఫ్‌ వేసిన తొలి బంతికి పరుగులేమీ చేయని బ్రేవో.. ఆపై వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ఒక్కో సిక్సర్‌ను ఒక్కో తరహాలో పెవిలియన్‌లోకి కొట్టాడు. మొత్తంగా 11 బంతులు ఎదుర్కొన్న బ్రేవో.. 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన సెయింట్‌ కిట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి ఓటమి పాలైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat