Home / POLITICS / రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు.

అలాగే ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ వందకు పైగా సీట్లని గెలిచి కెసిఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని పూజలు నిర్వహించారు. కెసిఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారికి భగవంతుండు అన్ని రకాల శక్తిని మనోధైర్యాన్నిచ్చి,ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకెళ్లేలా దీవించాలని ప్రార్థించారు.చివరిగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం కెసిఆర్ నాయత్వం తోనే సాదయమని, ప్రజలంతా ఎటువంటి సందేహం లేకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా టి.ఆర్.యస్ కి ఓటేసి వంద సీట్లకు పైగా గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మరియు అడ్వైసరీ సభ్యుడు దొంతుల వెంకట రెడ్డి & విక్రమ్ రెడ్డి రేకుల , కార్యదర్శులు సృజన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల మరియు సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం , అధికార ప్రతినిధి రవి ప్రదీప్ పులుసు మరియు రవి రేతినేని, నాయకులు సత్యపాల్ రెడ్డి పింగళి, వంశీ పొన్నం మరియు టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, కార్యదర్శి రాకేష్ పటేల్, టాక్ మహిళా నాయకులు సుప్రజ పులుసు, శుషుమ్న రెడ్డి, క్రాంతి తో పాటు వీరి కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు.
Image may contain: 12 people, including Srujan Reddy Chada and Naveen Reddy, people smiling, people sitting and food
Image may contain: one or more people, people sitting, fire, table and food

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat