Home / POLITICS / కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్‌

కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్‌

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు ప‌క్షులుగా మారిపోయార‌ని, రాజ్యాంగ తెలియ‌ని ఆ నాయ‌కుల తీరుతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు ,నిధులు, నియామకంపైనే జరిగిన నేప‌థ్యంలో కీల‌క అంశాల‌ను ప‌రిష్క‌రించేలా ముందుకు సాగార‌ని వెల్ల‌డించారు. అయితే ఈ ప‌ర్వంలో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌లు చేశార‌ని మండిప‌డ్డారు.

“భూసేకరణ చట్టాన్ని 2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. చట్టంలో ఉన్న లోపాలతో ఎన్డీఏ ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు భూ సేకరణ కోసం 123 జీవో తెచ్చింది. ఆ జీవో రావడంతో కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షులుగా మారారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సి వచ్చింది. కేసీఆర్ ను ప్రజల మధ్య ఎదుర్కోలేక కాంగ్రెస్ కోర్టులను ఆశ్రయించింది. ఇపుడు ఎన్నికలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కోర్టుల చుట్టూ తిరుగుతోంది“ అంటూ మండిప‌డ్డారు. కాంగ్రెస్ కుటిల రాజకీయం చేస్తోందని ఎంపీ వినోద్  కుమార్ ఆక్షేపించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలకు సై అంటే శశిధర్ నై అంటున్నారు అని ఎద్దేవా చేశారు. “అభివృద్ధిని అడ్డుకుని కేసీఆర్కు ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ఇవి కేవలం మూడు నెలల ముందు వస్తున్న ముందస్తు ఎన్నికలు. ఓటరు లిస్టులో 70 లక్షల మంది పేర్లు తొలగించారు అంటూ శశిధర్ కోర్టుకెక్కారు. రకరకాల కారణాలతో ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొలగిస్తారు. .ఓటర్ లిస్టుల్లో పేర్లు లేకుంటే కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చి మళ్ళీ నమోదు చేయించు కోవచ్చు కదా?“ అని సూటిగా ప్ర‌శ్నించారు.

దేశంలో ముందస్తు ఎన్నికలను దేశంలో మొదట తెచ్చింది ఇందిరాగాంధీయేన‌ని ఎంపీ వినోద్ వెల్ల‌డించారు. ఎన్నికలు ఆపాలనే ప్రయత్నంతోనే చిన్న సమస్యను కాంగ్రెస్ పెద్దది చేస్తోందని ఆరోపించారు. `అసెంబ్లీ రద్దు తర్వాత ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని రాజ్యాంగం చెబుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొందరు రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పడు రాజ్యాంగం రాసిన మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ నేతలే..అయినా ఆ రాజ్యాంగం మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గౌరవం లేదు. ప్రజల మీద నమ్మకం లేదు కాబట్టే కాంగ్రెస్ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. సేవ చేసే పార్టీ కనుకే టీఆర్ఎస్‌ను ప్రజలు మరోసారి ఆదరిస్తారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం. ఇకనైనా కాంగ్రెస్ నేతలు కోర్టుల చుట్టూ తిరగడం మాని ప్రజల మీద విశ్వాసం పెంచుకుంటే మంచిది` అని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat