Home / SLIDER / త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు కోమ‌టిరెడ్డి ..!

త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు కోమ‌టిరెడ్డి ..!

నల్లగొండలో టీఆర్ఎస్‌ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమ‌ని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాల‌యంలో శుక్ర‌వారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల పవరే ప్లాంట్ ను తాము అధికారం లోకి వస్తే మూసేస్తామని కోమటిరెడ్డి అనడాన్ని ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది కోమటిరెడ్డి వైఖరా ,కాంగ్రెస్ పార్టీ వైఖరా స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
నల్లగొండకు దామర చర్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను పోరాడి సాధించుకున్నామ‌ని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. “జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మౌనంగా ఉంటే అది కాంగ్రెస్ వైఖరిగానే భావించాల్సి ఉంటుంది. నల్లగొండ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ధర్మల్ పవర్ ప్లాంట్‌ను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. దామరచర్ల ప్రాజెక్టును ఇంతకు ముందు లోలోన అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు బహిరంగంగా తన నైజాన్ని చాటుకుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రగతి నిరోధక పార్టీ. నల్లగొండ జిల్లాను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఫ్యూడల్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంత అడ్డుకున్నా దామరచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం“ అని స్ప‌ష్టం చేశారు.  వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును అడ్డుకుంటూ కాంగ్రెస్ తన నైజాన్ని చాటిందని జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. “బతుకమ్మ చీరల పంపిణీ ని అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళల నోట్లో మట్టి కొట్టింది. రైతుబంధు చెక్కులను కూడా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టి తీరును రైతన్నలు గమనించాలి. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే పెన్షన్లను కూడా ఆపమని కొరేటట్టుంది. ప్రజా ద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఎలాగూ ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల పై కక్ష కడుతున్నారు.
కాంగ్రెస్ నేతల తీరును నల్లగొండ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి`అని కోరారు. కోమటిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే కదా మళ్ళీ రాజీనామా చేయడానికా అని ఎద్దేవా చేశారు. “ఈ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి ని వాళ్ల కుటుంబ సభ్యులే హిమాలయాలకు పంపేటట్టున్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ విఫలమయింది కనుక ప్రజలు ఆ పార్టీకి శాశ్వత సన్యాసంతీసుకోమంటారు. మేము కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ తిట్టగలం కానీ అలాంటి మాటలతో లాభం లేదు. కేసీఆర్ దీక్ష చేసినపుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కేసీఆర్ దీక్షపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇపుడు కేసీఆర్ దీక్షపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడిందాంట్లో తప్పేమి లేదు. ఎవరిపైనైనా మాట్లాడే హక్కు కేసీఆర్‌కుంది. కేసీఆర్ మాట్లాడిందాంట్లో బూతేమి లేదు. కేసీఆర్ పేరు వింటేనే చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజల రక్షకుడిగా కెసిఆర్ తెలియ జెప్పాల్సిన అవసరం ఉంది“ అని వారు స్ప‌ష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat